పుట:వెలుగోటివారి వంశావళి.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

45


ఎడ బిడదనె నహా నొడబాళరెలేనాను
        మున్నెఱ గిదె నను కన్నడీల
రేచర్ల సింహంబుఁ జూచెదమని మహా
        ధీరతల్ పలికెడు తెలుఁగుభటుల[1]
నెల్లఁ బాఱఁదోలి[2] యేలితి భూమెల్లఁ
బోల్ప సరియె నీకుఁ బుడమిపతులు
మాధవేంద్రపుత్ర మహనీయచారిత్ర
సంగరప్రతాప లింగభూప.

123


ఉ.

ఎత్తినకోపవృత్తి మద మెత్తి తురుష్కులఁ బాఱఁదోలి యా[3]
మొత్తములైన దుర్గములు ముప్పదిరెండును నొక్కధాటినే
యత్తఱిఁ గొన్న రాజవిలయాంతక[4] మాదయలింగశౌరితో
నెత్తొరలేని భూపతుల నెన్నఁగ నేల[5] ధరాతలంబునన్.

124


వ.

ఆలింగమనేఁడె యొకనాఁటిధాటిని ముప్పదిరెండు దుర్గములు పుచ్చుకొని
యేకధాటీసమర్థ, విషమధాటిపాంచాల, చతురుపాయదక్ష[6], రిపుప్రళ
యాంతకోపేంద్ర, యష్టదిగ్రాజమనోభయంకర, యవఘళరాయమానమర్దన,
మేదినీరాయదుష్టగజాంకుశ, కోటలగొంగ బిరుదులను వహించి, రాజుల,
రెడ్డిబిడ్డలఁ గాలిపెండానఁ జెక్కించి, మూరురాయరగండపెండారంబు డాకా
లఁ బెట్టి, సంగమరాయల నాగులపాటొద్దఁ గొట్టి, రాయవేశ్యాభుజంగ
బిరుదు వహించినవాఁడు.[7]

125


సీ.

శ్రీమల్లికార్జునసేవాసమారూఢి
        నిత్యవైభవలీల నెగడినాఁడు

  1. A.B. అహఖొణు ఖొణుమెజ యమారు భేతృమె రుఖుదె ఖుదె యనియెడు రహితవరులు
    గోసాయుబలతలె ఖాణుజారేఖాయు అతకతలె ఖనిరి నారజనులు
    యడబెడదనె నహా నొడబారెడనాను మున్ను హెర దనెడి ఖన్నడీలు
    రేచర్లసింహ్వమని చూచదమని మహాధీరుతులు బలికిరి దెలుగుభటులు
  2. A. యల్లపారదోలి, B. యల్లిపారకోలి
  3. B దోలినయంతవేగయా
  4. A.B. రాజనృలకాంతుడు
  5. A.B. నెత్తొరలేరుభూపతులు యెన్నగలేరు
  6. A.B. తతురోపాయ
  7. The subject రావులింగమనాయండు is repeated in the Mss at the end of the passage.