పుట:వెలుగోటివారి వంశావళి.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

వెలుగోటివారి వంశావళి


మీయన్న వేదాద్రి మెఱసి కోమటిమాచ
        విభుఁ దమ్మపడిగాన వెలయఁ బెట్టెఁ
బరఁగ నీ వేడేండ్లఁ[1] బంటక్షత్రియులకుఁ[2]
        బొగడొంద వలపులబొజుఁగ వైతి
వనఁగ వినుతి కెక్కి తాంధ్రగౌళ[మరాట]
భోటమగధకుకురభూపులందు[3]
మాధవేంద్రపుత్ర మహనీయచారిత్ర
సంగరప్రతాప లింగభూప.

121


సీ.

ఎలమి మీపెదతాత యినుగుర్తియొద్దను
        రాజుల వెసఁ జంపి రమణ మెఱసె
నలచోడభక్తీంద్రు ననవరాజును
        బెంపారఁ గాచె మీపిన్నతాత[4]
దేవరకొండొద్దఁ దెగువమై మీతండ్రి
        యెఱకృష్ణరాయని శిరము ద్రుంచె
మీయన్న వేదాద్రి మెఱసి కోమటిమాచ
        విభుఁ దమ్మపడిగాన వెలయుఁ బెట్టె
మొనసి నీవు మఱియు మును గంగకాడను[5]
బోయగముల నెల్లఁ బ్రోచి తౌర[6]
మాధవేంద్రులింగ[7] మనుజేంద్ర నీసరి
యెన్నఁగలుగు నృపతు లేరికి[8] చెప్ప.

122


సీ.

(?)ఆహ ఖొణు ఖొణు మేజయామారుభేతరు
        మెరుఖుదె ఖుదెయను తురకవారి
(?)గోసాయు బణెతలె ఖోణజయాభాయి
        ఆతమాలేఖను నారెజనుల

  1. A.B. వేడెండ్ల
  2. A.B. క్షత్రిలకు
  3. A.B. నృపులయందు
  4. A.B. అలచోడ భట్టింద్రు వలదేవరాజును పెంపార గాంచె మీపిన్నతాత
  5. A.B. మొనసి నీవు మొన్న మురియుగంగకాడ
  6. A.B. మిగులగాచి
  7. A.B. లింగయ
  8. A.B. యెన్నగలరె నృపతులేమి