పుట:వెలుగోటివారి వంశావళి.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

వెలుగోటివారి వంశావళి


ఖానుసూరినిమల్క గదిమి మీయన్నటు
        లరువపల్లొద్దను నమర గెల్చె
మలయఁ గృష్ణకడను మాఱ్కొని నిల్చిన
కన్నడీల[1] నెల్ల గదిమి తౌర
మాధవేంద్రపుత్ర మహనీయచారిత్ర
సంగరప్రతాప లింగభూప.

119


సీ.

ధాత్రి మీముత్తాత తం డ్రె[2]ఱ్ఱదాచండు[3]
        తనివారఁ బాండియ[4]దళము గెల్చె
జెలఁగి మీముత్తాత[5] సింగక్షితీశుండు
        కాపభూపతి గెల్చెఁ గదనమునను
ధట్టించి మీతాతతండ్రి మాధవుఁ డాజి
        నన్నవోతారెడ్డి యద టణంచె[6]
విజయియై[7] మీతాత వేదగిరీంద్రుండు
        దిక్కులఁ దనయాజ్ఞ దీటుకొలిపె
మెఱసి లోక మెఱుఁగ మీతండ్రి మాధవ
క్ష్మాధిపుండు గెల్చెఁ గన్నడీలఁ
దొడరి చలమచర్ల దుర్గంబు గొంటివి[8]
ధరణిలోన లింగనరవరేణ్య.

120


సీ.

అదలించి మీతాత యన్నవోతారెడ్డి
        దన్నాలకోటొద్ద వెన్నుఁ జూచెఁ
దనర మీపెదతండ్రి దాచభూపాలుండు
        కొమరగిరికి బొమ్మ గోరి పెట్టె[9]

  1. A.B. ఘన్నడీల
  2. A.B. తండ్రెఱ ; V.V.C. p 58 తాతెఱ్ఱదాచాఖ్యు
  3. A.B. దాచాంకు తనివార; V.V.C. p58 చెలఁగి తాతకుఁ దాత
  4. A.B. పాండ్యయ
  5. A.B. చలగిమీ(ముత్తాత)
  6. A.B. యదటణంచ; V.V.C. p 58. దట్టించి మీతాతతండ్రి మాధవనృపుం డన్నపోతారెడ్డి నాజి దునిమె
  7. A.B. విజయుఁడై V.V.C. p 58;
  8. A.B. వర్గంబుగొంటివి
  9. A.B. గీలుకొల్పె