పుట:వెలుగోటివారి వంశావళి.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

43


ర్వించిన నీకుఁ జొప్పడునె వేమరు నల్లయవేమరెడ్డి పో
కొంచెపుఁ దమ్మతిండి తినుకూళకు[1] సింహతలాట మేటికిన్.

114


ఉ.

భూపవరుండు మాదనృపపుంగవులింగన రత్ననూపుర
స్థాపితులైన రాజకులసంఘము లల్లయవేము నండ్రు నీ[2]
వేపున లజ్జ పోవిడిచి యేటికి వచ్చితి తమ్మగుర్లతోఁ
గాఁపన నీవు నందెఁ బదకైకొను మల్లట నొక్కచెంగటన్[3].

115


ఉ.

ఆజిముఖాతి[4]భీతులగు నల్లయవేమన వీరభద్రుఁడున్
రాజకులాభిరామ రణరాఘవ లింగనృపాల నీమహా
రాజతపాత్రఁ దమ్ముఁ దిని రాజ్యము నిల్పిరి యింక నే మనన్
రాజమహేంద్రదుర్గములు రాజులు గైకొనకుండఁ జూతురే.

116


ఉ.

వాదులు వాద[5]విద్యల సువర్ణము గాంచుట యద్భుతంబె యీ
మాదయ లింగశౌరి గరిమంబుగ నల్లయవీరభద్రుఁడున్
వాదము చేసి దేహము సువర్ణమయంబుగ వాని యందియన్
ఖేదము దక్కి యుండు[6] దలక్రిందయి వ్రేలుచు విఱ్ఱవీఁగుచున్.

117


ఉ.

బల్లరగండలింగవిభుపాదమునందుఁ బసిండియందె తా
ఘల్లురు ఘల్లుఘల్లు రన ఘల్లని మ్రోయఁగ భీతి గుండియల్
ఝల్లురు ఝల్లు ఝల్లు రన ఝల్లన నల్లలనాడుచుందు రా
యల్లయరెడ్డివేముఁడును నాతనితమ్ముఁడు వీరభద్రుఁడున్.

118


సీ.

ఏఁపున గంగ దాఁ టెల(?)రెడ్డిపోతని
        దనరార గెల్చె మీతండ్రితాత
యెలమి రాజులఁ గొట్టి యెఱకృష్ణరాయని
        తలను[7] ఖండించె మీతండ్రితండ్రి
బలిమిమై నాజిలోఁ బందడాధీశుని
        గడువడి గెల్చె నిన్గన్నతండ్రి

  1. A.B. తినుగూటకు
  2. A.B. వేమనేంద్రదా
  3. A.B. కాపన నీవు నందె పదకైకొని అల్లటనొక్కి చంగటన్
  4. A.B. ఆజిముఖాది
  5. A.B. వాదులలువాడ
  6. A.B. యుండి
  7. A.B. తలలను