పుట:వెలుగోటివారి వంశావళి.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

41


సోమకులమురాజులును[1], దమ్మపడిగానఁ బొదిగియున్న[2] పంటరెడ్లును
దమలోఁ దాము[3]3 భాషించుచున్న విధం బెట్టి దనిన.

111


శా.

శ్రీలాలిత్యుఁడు రావులింగనృపతిశ్రీపాదపద్మంబునన్
వ్రేలేరాజులు కొంద ఱల్లయ[4]సుతుం వీరాంకుఁ జూపింత్రు వీఁ
డేలా కంపము నొందె[5] భీతి నదిగా దీకాఁపు జాణండు దాఁ
గాలంజింగల[6] తమ్మ మెక్కి వణఁకున్ గర్పూర మ న్నెక్కినన్.

112


సీ.

వగరు మిక్కిలియైన వరువట్టు బాగాల
        కసటు యఃహావెళ్లఁ గ్రాసి క్రాసి[7]
చిరుమన తెల్లాకుఁ జిగురులు కుత్తుకఁ
        దగిలిన హహ్హని[8] దగ్గి దగ్గి
వెస మ్రింగఁ దాంబూలరసము వెగ్గలమైన
        నోక్కని పలుమారు లోకిలించి
పచ్చకర్పూరంపుఁ బలుకుల లాహిరి
        హిక్కని[9] సారెకు సొక్కి సొక్కి
వెలరి యుహ్హున నూదుచు[10] వేమవీర
భద్రు లుందురు[11] నీతమ్మ పడిగమందు
గాయగోవాళబల్లరగండ బిరుద
యంగభవరూప మాదయలింగభూప.

113


ఉ.

అంచిత రాయరావుబిరుదాంకము రాజులఁ గొట్టి యందెఁ గీ
లించిన మాదభూవిభుని లింగనృపాలున కొప్పుఁగాక గ

  1. A.B. న్ను
  2. A. పొదిగున్న; B. పొదిగివున్న
  3. A.B. తమరున్ను
  4. A.B. కొండరళ్ళయ
  5. A. నుండె
  6. A. గాలంజందుల B. దాలాంజందుల
  7. A.B. ర(క)పటు అఃహావెళ్ల గాసికాసి
  8. A.B. చిరువాని. . . . . .హఃహఃన
  9. A.B. యిస్సిని
  10. A.B. వెలయవూహుననూదుచు
  11. A.B. వేమవీరభద్రులుండునీ