పుట:వెలుగోటివారి వంశావళి.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

వెలుగోటివారివంశావళి


అనుపమంబుగఁ గొమరవేదాద్రి నిట్లు
ఘనతరంబుగఁ దమ్మపడ్గమునఁ బెట్టి
దొరల[1] బుద్ధుల విని యిటు[2] దొరలఁ బడియు
విన్నఁబడితివి పెదకోమటన్నవేమ.

108


వ.

ఆలింగమనేనిచేత శ్రీనాథుఁడు నందికంతపోతరా జను కఠారిని గొంచుపోయిన
పద్యము.

109


సీ.

జగనొబ్బగండాంక సంగ్రామనిశ్శంక
        జయసిద్ధి[3] రాయవేశ్యాభుజంగ
అఖిలకోటలగొంగ యరిరాజమదభంగ
        మేలందు ధరణీశ మీనజాల
మూరురాయరగండ మురియు[4] రాజులమిండ
        యభివృద్ధి రాయచౌహత్తుమల్ల
ఘనగాయగోవా కామినీపాంచాల
        బ్రహ్మాయు శశివంశ పరశురామ
దండిబిరుదుల సురథాణి గుండెదివుల
భళిర యల్లయవేముని పరఁగుమిండ[5]
రమణ మించిన మేదినీరావుబిరుద
సంగరాటోప మాదయలింగభూప.

110


వ.

ఆలింగమనేడే సోమకులమురాజులు మొదలయిన రాచవారినెల్లఁ గొట్టి[6]
కాలిపెండానఁ బొదిగించెను.[7] అనవేమారెడ్డి మొదలయిన పంటవారి నెల్లఁ
గొట్టి[8] తమ్మపడిగానఁ బొదిగించెను.[9] కాలిపెండానఁ[10] బొదిగియున్న[11]

  1. A.B. యొరుల
  2. A.B. యిల్లు
  3. A. జయశుధి , V. P. Sastri, Sr. Sr. p 132 జగతీశ
  4. A వరుయు; B. మువురు
  5. A.B. పరుగ; V. P. Sastri పగర
  6. A.B. నెల్లాగొట్టి
  7. A.B. పొదిగించను
  8. A.B. నెల్లాగొట్టి
  9. A.B. పొదిగించను
  10. A.B. పెండేన
  11. B. పొదిగిలన్న