పుట:వెలుగోటివారి వంశావళి.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

39


పూని కొమారవేదగిరి పుణ్యపరుండవు నీకుఁ బాడియే
పీనుఁగుఁ జూఁడఁగా దనుట[1] భీమునియన్నవు సత్యసంపదన్.

105


ఉ.

వేమనతోడఁబుట్టు వఁట వింతలు నేఁ డదిగాక మానెఁబో[2]
కోమటివాని బిడ్డఁ డఁట గోళకుఁడున్ గృషిచేయువాఁ డిఁకన్
భూమిఁ గుమారవేదగిరి ఫుణ్యపరుండవు నీసమక్షమం
[3]దేమని చెప్పవచ్చు గుణహీనుని కోమటిరెడ్డిమాచనిన్.

106


వ.

ఆకొమారవేదగిరినేఁడే యనవేమారెడ్డి తమ్ముని మాచారెడ్డినిఁ గొట్టి తమ్మ
పడిగానఁ బొదిగించిన, నాయనవేమారెడ్డి పినవేదగిరినేనిఁ జంపి తమ్మపడి
గానఁ బొదిగించి సింహతలాట బిరుదును బుచ్చుకొని యుండిన, వేదగిరినేని
తమ్ముఁడు లింగమనేఁడే ద్వాదశవర్షంబుల వాఁడై యుండి, తనబంధువర్గం
బుల హితపరిజనంబులఁ గూర్చుకొని యమరులకు వెక్కసంబగు యుద్ధంబుఁ
జేసి యనవేమారెడ్డినిఁ గొట్టి తమ్మపడిగానఁ బొదిగించి సింహతలాట బిరు
దును దనచేత శ్రీనాధుఁ డడిగి కొంచుబోయిన 'నందికంతపోతరాజ' ను కఠా
రిని బుచ్చుకొనెను. అంతకు ముందె యనవేమారెడ్డికిఁ బెద్దలు పిన[4]వేదగిరి
నేనిఁ దమ్మపడిగానఁ బెట్టవద్దని బుద్ధిక్రమంబుగాఁ జెప్పిన విధం బెట్టి దనిన.

107


సీ.

దన్నాలకో టొద్దనన్నపోతారెడ్డి
        తా విఱుగు తలంపుఁ దలఁప వైతి
సింగయమాధవుఁ జేరిన యనవేముఁ
        డోడి పాఱు[5] కొఱంత చూడ వైతి
కొమరగిఱ్ఱెడ్డికిఁ గోరి సింగయమాదు
        తనరఁ బెట్టిన బొమ్మఁ దలఁప వైతి
సురథాను మన్ననఁ జూచుకొంటివి గాని
        వారితో దొరయుట వలవ దనవు

  1. A.B. పీనుగజూడగాదనుచు
  2. A.B. చో
  3. A బేమని
  4. A. B. పెద
  5. V P.Sastri, A కోటవెల్లని