పుట:వెలుగోటివారి వంశావళి.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

వెలుగోటివారి వంశావళి


కడిమిమై నీవు తగఁ బండికనుమ యొద్దఁ
బరగ బేరోజి సురథాను పరిణమింపఁ[1]
గదనమున నౌర గెల్చితి కన్నడీల
రమ్యదేవేంద్ర వేదయరామచంద్ర.

100


వ.

అతని యనుజుండు.

101


ఉ.

దేవరకొండయెద్ద నతితీవ్రపరాక్రమవిక్రమంబునన్
జేవ దలిర్పఁగా జయము చేకొని యాయెఱకృష్ణరాయనిన్
భూవినుతంబుగా నఱికి భూతగణంబుల[2] కుత్సవంబుగా
వావిరిఁ జేసె నౌర! కులవర్ధనుఁడైన కుమారమాదఁడున్.

102


వ.

దేవరకొండమీదికి నెత్తివచ్చిన యెఱకృష్ణరాయనిఁ జంపి జయము గాంచి,
పందడాధీశుని గెల్చి వరగొండదుర్గంబును గొని హొన్నగట్టు కుదిరెగట్టు
మండలీకరగండ బిరుదును, ఎరుకవరప్రాంతంబున[3] మన్నెజంగిలిఁ గొట్టి పని
ఘానరాయ, బసవశంకర బిరుదులను[4] వహించినవాఁడు కొమారమాదా
నేఁడు. ఆమాదానేనికి పినవేదగిరినేఁడును, లింగమనేఁడును బుట్టిరి. అం
దగ్రజుండు.

103


చ.

అరయఁగ వీఁగె నింద్రగిరి నారయ శూలిగిరిన్ జలించె మం
దరగిరి జర్జరం దిరిగె దా మయినాకగి రీఁగె వార్ధిలో[5]
ధరణి నొదింగె[6] వింధ్యగిరి తక్కుగిరుల్ కపు లూఁచ నింక నే
గిరులు కొమారవేదగిరి గీటుకు[7] రావలె ధీరతోన్నతిన్.

104


ఉ.

మానుగఁ గోమటన్నయనA.B. [8] మాచన పుత్త్రకళత్రమిత్రులన్
గానఁగఁ జూడఁగా దనుచుఁ గాల్చిరి వార లనిష్టపాత్రులై (?)[9]

  1. V.V.C P 59 పరిభవించి
  2. A.B. గజాలకు
  3. A.B. బ్రాంత్యంబున
  4. A.B. బిరుదు
  5. A.B. వార్ధికిన్
  6. A.B. ధరణినొదింగె
  7. A.B. పాటికి
  8. కోమటన్న యను
  9. A.B. నిష్కపాత్రులై The meaning of the first two lines of the stanza is not quite intelligible.