పుట:వెలుగోటివారి వంశావళి.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

37


దేవరకొండ [యనునీ] రెండుపురంబులు పంచుకొని రాజుకొండ యన
పోతానేఁడును[1] దేవరకొండ మాదానేఁడును[2] ఉంచుకొనిరి. ఆమాదానేని
కుమారుఁడు పెద్దవేదగిరినేఁడే వేములకొండకడ[3] సత్యగదేవుని, జాళిక్య
దేవుని, గన్నడదేవుని, గంకాళదేవుని, నుదయనదేవునిఁ గొట్టి[4], వేముల
కొండ రణరంగస్థలవైరిరాజజీమూతపవన, యేకశిలానగర[5]సమీపశాత్రవ
రాజన్య[వనదహనదావానల], బెండపూడి[6]విభాళ బిరుదులు[7] వహించిన
వాఁడు. [8]ఆపెదవేదగిరినేనికి రామచంద్రుఁడును, కుమారమాదానేఁడును
పుట్టిరి. అందగ్రజుండు:

99


సీ.

కుంట్లూరియిమ్మడిఁ గూల్చిన యెఱదాచ
        భూతలాధిపుఁడు[9] మీతాతతాత
అనిలోన ముచ్చగన్నయను ద్రుంచిన సింగ[10]
        ధారుణీశ్వరుఁడు మీతాతతండ్రి
తొడరి భండారుముమ్మడి వధియించు మా
        ధవభూమిభర్త మీ తండ్రితండ్రి[11]
గుండ్రదండ్రాయని[12] ఖండించి సన్నుతి
        గాంచు వేదగిరి ని న్గన్నతండ్రి[13]

  1. A.B. అనపోతానేడు
  2. A.B. మాదానేడు
  3. A.B. కాడ
  4. A.B. దేవులగొట్టి
  5. A.B. యేకశివానగర
  6. A.B. బెండెపూడి
  7. A.B. బిరుదు
  8. A.B. రావు పెదవేదగిరిగేడు These words are superfluous.
  9. V.V.C. p 63; A.B. భూభర్త
  10. V.V.C. p 63; A.B. ద్రుంచుయాసింగ
  11. A.B. మాధవాభూభర్త; V.V.C. p 3 ముమ్మడిని నాజి నడంచితనరు
  12. A.B. గుండ్రగుండ్రాయని
  13. A.B. ఖండించి సన్నుతి గాంచు పెదవేదగిరి నిన్ను గన్నతండ్రి. V.V.C. p 53 సన్నుతి
    గాంచుటఁ బరఁగె నిన్గన్నతండ్రి