పుట:వెలుగోటివారి వంశావళి.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

వెలుగోటివారి వంశావళి

కొమరొప్ప రేచర్లకులవార్ధిచంద్రుఁడై
        మేటిరాజన్యుల మించినాఁడు
దినము షోడశదానదీక్షాగురుండునై
        తనకీర్తి దిక్కులఁ దనిపినాఁడు
ప్రతిగండభైరవ ప్రకటమేదినిరావు
        బిరుదుల విఖ్యాతిఁ బరఁగినాడు
...........................................[1]
వచ్చి చాళిక్యజువ్వండు దాఁకిన నిల్చి
        యడవెల్లిచొరఁబాఱ నడచినాఁడు
పరికించి జయసింగు భంజించి యోరుగ
        ల్లెఱుఁగంగ సిరివోలు నెక్కినాఁడు
...............................................
ఏపున రాజుకొం డెక్కి సంగరమున
        మునుగంటి ముమ్మని మొత్తినాఁడు
గణపవరం బెక్కి కడువిక్రమంబునఁ
        గోనకోటారెడ్డిఁ గొట్టినాఁడు
కినుక పోలేపల్లి క్రేవ నాణమరాజు
        నవలీలతో గర్వ మణఁచినాఁడు

  1. The places marked with ... indicate the omission of lines which attribute to Linga all the achievements of his ancestors. These lines are given below in the order in which they are found in the Mss.
    ఇమ్మహి కుంట్లూరి యిమ్మడి ఖండించి గొల్లపల్లెను రణము గుడిపినాఁడు
    ...............................................................................................
    కాకితిరుద్రుండు గణుతింప కంచిలో పంచపాండ్యుల భంగపఱచినాఁడు
    ...............................................................................................
    మేటినాగార్జునకొండ మీటుగఁ గొని గోలిమల్లారెడ్డిఁ గొట్టినాఁడు
    ధట్టించి కదపిన తంగేటిరాజేంద్రుఁ దుమురుకోటొద్దను దునిమినాఁడు
    మచ్చకొమ్మని గన్నమయయౌబళేంద్రుని జిలుగుపల్లొద్దను జెండినాఁడు
    ...............................................................................................
    కొలచల్మకాడను బలియుఁడై తురకలఁ గొట్టి యశ్వములను బట్టినాఁడు
    కదిపి వేములకొండకడకు తేరలరాజు సంబెటఁ గొని వెన్నుఁ జఱచినాఁడు
    కాపభూపాలుని ఘనబాహుబల మెల్ల నలభీమవరమొద్ద నణఁచినాఁడు
    మగఁటిమి మెఱసి ముమ్మడిప్రోలభూవరు నెఱుకవరంబొద్ద జరపినాఁడు
    దన్నాలకోటొద్ద నన్నవోతారెడ్డిఁ గొంకక లజ్జ పోఁగొట్టినాఁడు
    ..........................................................................
    చెలగి నూటొక్కరాజుల జల్లిపల్లొద్ద ద్రుంచి రణంబు గుడ్పించినాఁడు
    ..........................................................................
    మహియెల్ల నెఱుఁగఁ గోమటిమాచభూవరుఁ దమ్మపథంబునఁ దాపినాఁడు
    ..........................................................................
    మహనీయజయశాలి మచ్చరుద్రమనేని మగతులయొద్దను మార్చినాఁడు
    ..........................................................................
    సంగరంబునఁ గొట్టి సత్తికదేవుని భూతతతికిఁ బొందు పఱచినాఁడు
    ధీమంతుఁ డైనట్టి తిరుకాళరాయనిపట్టి పట్టం బిల గట్టినాఁడు
    దేవరకొండొద్ద తేజోవిభాగుఁడై యెఱ్ఱకృష్ణుని తల నేరినాఁడు
    ఘనభుజాబలశక్తిఁ గాకితిరాజ్యంబు తిరుగరాఁ బునరుక్తిఁ దెలిపినాఁడు