పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుపట్టినది. ఒక తార్కాణము, భరతాశ్రమమున లేడిపిల్ల సంచారము వర్ణించుపట్టు.

మూలము.

చచారాశ్రమపర్యంతే తృణాని గహనేషునః।
దూరంగత్వా చశార్దూల త్రాసాదభ్యాయయౌపునః॥
ప్రాతర్గత్వాతి దూరంచ సాయమాయాత్త దాశ్రమమ్।
పునశ్చ భరతస్యా భూత్ ఆశ్రమస్యోట జాజిరే॥

సూరన

సీ.

పూరి మేయగ దవ్వుపోయి బెబ్బులిపిండు, దిగులునఁ గ్రమ్మఱఁ దిరిగివచ్చు
సారెసారెకుఁ దదాశ్రమసమీపమ్మున, వేడ్కతో గంతులు వేయుచుండు
మలయుచు వచ్చి కోమలయుగ్మశృంగంబు, చేత నెమ్మేని కండూతిఁ దీర్చు
యోగాసనంబున బాగు మీరగనుండ, మవ్వంపుతొడలపైఁ బవ్వళించు


గీ.

పర్ణశాలచుట్టు పరువులు పెట్టుచు, లేతయైన పూరి మేత మేయు
ననుదినంబు నిట్టు లామృగశాబంబు, ముద్దుచూపుచుండు మునివరునకు

భాగవతము.

చ.

గురువులు వాఱి, బిట్టుఱికి కొమ్ముల జిమ్ముచు నంతకంత డ
గ్గఱచును గాలు ద్రవ్వుచు నఖంబుల గీఱుచు గాసి సేయుచు
న్నొఱగుచు ధారుణీశ్వరునియూరువులల న్శయనించి యంతలో
నఱకడ యెక్కుచున్ బొదవియాడుచు నాహరిణంబులీలతోన్.

(పంచమస్కందం 106 - ప.)

భావనారాయణ

సీ.

నటనగా నుటజాంగణమున గంతులు వేయు, మురియుచు నవకుశముష్టి మేయు
కండూతి వో ఖురాగ్రముల నంగము గోకు, వెఱమృగంబులఁ జూచి బెదఱి పఱచు
తరుణరసాలపోతముల ప్రక్కలు రాయు, పలుమారు కుంజగర్భములు దూరు
దూరంబుగా నటవీరాజిఁ బడి పోవు, వేవేగ మగుడి యావిర్భవించు


గీ.

కెలనఁ దననీడఁ గన్గొని క్రేళ్లు దాటు, నేల మూర్కొని పలుమారు నింగి చూచు
నలసి శయనించి రోమంధ మాచరించు, తరుణమృగశాబ మారాచతపసియెదుట.

పైనుదాహరించిన పద్యములలో నీపద్యము లలితలలితమై, స్వభావోక్తిగుంభితమై యెంతయో మనోహరముగా నున్నదనుటకు సంశయము లేదు.