పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. నిశ్శ్రీకులైన దేవతలు, బ్రహ్మను పురస్కరించుకొని పాల్కడలి చేరి విష్ణుని స్తోత్రము చేయఁగా భగవంతుఁడు వారికి దర్శన మిచ్చుసందర్భమున మూలములో—

తందృష్ట్వాతే తదాదేవాః, శంఖచక్రగదాధరమ్
అపూర్వరూపసంస్థానం, తేజసాంరాశి మూర్జితమ్.

అనునొకశ్లోకము కలదు. ఈ శ్లోకార్థమును నీ కవి యెంతగాఁ బెంచెనో చూడుఁడు—

సీ.

ఎద బొదల్ సిరిమేననొదుగు నుంజాయల మక్క డించిన పైడిమణుఁగువాని
తళుకుదంతముల నిద్దపురుచిచ్ఛటలని, న్మడియైన కలికిలేనగవువాని
మేలిడా ల్చల్లు కెంగేలిచిందపుతేట, నీటైనచుట్టువాల్మెఱగువాని
తెలికన్నుగొనల చూపులఁ జాలకళ లెక్కు, నక్రకుండలసమున్నతులవానికి


గీ.

చతురకలశాంబునిధి సుధాసౌధవీథి, జిలుగుతరగల ముత్యాలచేర్లు సిరుల
నలరు ఫణిరాజుతూగుటుయ్యాలఁ దూగువాని, శ్రీజానిఁ గనిరి వాగ్వరుఁడు సురలు.

(ఆ 1-ప 208.)

వెన్నెలగంటి సూరన గ్రంథములో నిట్టిదే యొకవర్ణన కలదు. ఇది వాని యనుకరణమని తోఁచెడిని.

సీ.

శతకోటిభాస్కరసందీప్తతేజునిఁ, బ్రావృట్పయోధరభవ్యగాత్రు
శంఖసుదర్శనశార్జగదాహస్తుఁ, బీతకౌశేయశోభితకటీరు
లాలితశ్రీవత్సలాంఛనలాంఛితుఁ గౌస్తుభగ్రైవేయకప్రభావు
ఇందిరామందిరాయతపీనవక్షునిఁ, దారుణ్యకోటికందర్పమూర్తి


గీ.

పుండరీకాక్షు జగదేకపూతచరితు, సతతకరుణాకటాక్షవీక్షణసమస్త
యోగినిర్మలహృదయపయోజనిలయు, విష్ణు పొడగాంచి సంతోషనివాళు లగుచు.

(వే. సూ. విష్ణుపురాణ, ఆ 1 ప 166.)

3. పాల్కడలిని లక్ష్మి యావిర్భవించుఘట్టమున మూలములో లేనివర్ణన మిందు చాలఁగలదు. (ఆ 1 ప 224-230) ఇట్టి వర్ణన వెన్నెలగంటి సూరన గ్రంథములోను లేదు.

4. ధ్రువచరిత్ర

ఇందీకథయంతయు యథామాతృకమే గాని తపము చేయఁబోవుధ్రువుఁడు తల్లితో—

చ.

అమితపరాభవానలశిఖావృతి గందిన నింక నుత్తమో
త్తమపదలాభ మొందెద వృథావచనంబులు పల్కు నీనప