పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేము వానికిఁ దప్పులనక ప్రయోగవిశేషము లందుము. ఏమన స్వతంత్రుఁడును, బహుగ్రంథకర్తయు నగు కవిని నసమగ్రలక్షణమునకు విధేయునిఁ జేయుట శాస్త్రవిరుద్ధము అట్టి ప్రయోగవిశేషముల నీక్రిందఁ బొందుపఱచుచున్నాము.—

ఆ ప విశేషము
1 23 — కార్మొగుల్ పసగెల్వ (కార్మొగుల పసలనియర్థము)
    481 — కార్మొగుల్ నిగనిగల్ (కార్మొగుల నిగనిగలు)
    538 — మిక్కిలీ భూవలయంబునన్. (మిక్కిలి యీభూవలయంబునన్)
      64 — మిక్కిలయ్యున్
     578 — గట్టైయుండన్ - (కట్టియైయుండన్)
     105 — ఒనరు దేను (ఒకరుదున్, ఏను)
     111 — కేశవాచ్యుత ( కేశవ! అచ్యుత!)
     182 — చేసిటు - (చేసి+ఇటు)
               చుట్టిచ్చి - (చుట్టి+ఇచ్చి)
     190 — ఎక్కుక - ఎక్కుకొని
     208 — ఎదబొదల్ - ఎదబొదలు.
     206 — చొరవఁగా - చొరఁగా
     408 — సతుల వెయ్యింటిఁ గనియె, వేయిమందిని అనుట.
     568 — అని దై త్యేంద్రుని సమ్మతించి - సమ్మతింపఁ జేసి
2 71 — 2పా॥ సంపూర్ణ స్ఫూర్తి-ర్ణ -లఘువు చేయబడినది.
      78 — క్రొవ్వునఁ గోడలిఁగూఁతురుఁ గలిసిన.
     235 — తనయుకు - (తనయునకు)
3 74 — పథ్యుకు - పథ్యునకు
4 184 — తీసుక - తీసికొని

ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నీగ్రంథము ప్రతి యొక్కటియే కలదు. అందెక్కుడు తప్పులు గాని గ్రంథపాతములుగాని లేవు. ఇదిగాక డాక్టర్. బుజ్జా శేషగిరిరావు పంతులుగారు యమ్, ఏ. పిహెచ్, డి. (ఆంధ్రభారతీతీర్థాధ్యక్షులు విజయనగరము) వారియొద్దఁ గల వేఱక ప్రతి యాదరమున నొసంగిరి. మాయొద్ద నున్నప్రతిలో సందిగ్ధములై యున్న కొన్నిపాఠములు దానినిబట్టి చక్కఁజేసితిమి. ఈ రెంటను తీరని సందేహములను మూలమును బట్టి