పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 811681 : 109. ఈ చట్టములో ఏమి ఉన్నప్పటికిని, 83వ పరిచ్ఛేదము క్రింద ఏదేని సంయుక్త కమీషను ఏర్పాటు చేసినచో,

(ఎ) రాజ్య ప్రభుత్వము కొరకు ఏర్పాటు చేసిన సంయుక్త కమీషను, రాజ్యము యొక్క అనన్య ప్రాదేశిక అధికారితా పరిధి. క్రిందకి వచ్చు. ఆదేశపు విషయమునకు 'సంబంధించినట్టి సందర్భములలో మాత్రమే ఈ చట్టము క్రింద ఏదేని ఆదేశము నిచ్చుటకు సవర్ధత కలిగియుండును;

(బి) కేంద్ర ప్రభుత్వము మాత్రమే, పాల్గొను ప్రభుత్వములు కరారును చేసుకొనుటలో విఫలమైనచో లేక పాల్గొను రాజ్యములు లేక వారిలో మెజారిటీ వారికి కేంద్ర ప్రభుత్వమును అట్టి ఆదేశములను జారీ చేయుమని కోరినచో, రెండు లేక అంతకన్నా ఎక్కువ రాజ్యముల ప్రాదేశిక అధికారితా పరిధిలోపు విషయములకు సంబంధించి లేక సంఘ రాజ్య క్షేత్రమునకు సంబంధించి ఏదేని ఆదేశము ఉన్నచో, ఈ చట్టము క్రింద ఏదేని ఆదేశమునిచ్చుటకు, సమర్థత కలిగియుండును.

భాగము-11

విద్యుచ్ఛక్తి కొరకు అపీలు ట్రిబ్యునలు.

110. కేంద్ర ప్రభుత్వము, అధి సూచన ద్వారా, ఈ చట్టము లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద అధినిర్ణయ అధికారి లేక సముచిత కమీషను యొక్క ఉత్తర్వులపై అపీలును ఆకర్ణించుటకు విద్యుచ్ఛక్తి కొరకైన అపీలు ట్రిబ్యునలుగా పిలువబడు ఒక అపీలు ట్రిబ్యునలును స్థాపన చేయవచ్చును.

111.(1) ఈ చట్టము క్రింద అధినిర్ణయము చేయు అధికారి ద్వారా చేయబడిన (127వ పరిచ్ఛేదము మినహా) లేక ఈ చట్టము క్రింద సముచిత కమీషను ద్వారా చేయబడిన ఉత్తర్వు ద్వారా వ్యధితుడైన ఎవరేని వ్యక్తి విద్యుచ్ఛక్తి కొరకు అపీలు ట్రిబ్యునలుకు అపీలు చేసుకొనవచ్చును.

అయితే, ఏదేని పెనాల్టీ విధించు అధినిర్ణయ అధికారి యొక్క ఉత్తర్వు పై అపీలు చేయు ఎవరేని వ్యక్తి, అపీలు దాఖలు చేయునపుడు, అట్టి పెనాల్టీ మొత్తమును డిపాజిటు చేయవలెను.

అంతేకాక, ఏదేని ప్రత్యేక సందర్భములో, ఆపీలు ట్రిబ్యునలు, అట్టి పెనాల్టీని డిపాజిటు చేయుట ద్వారా అట్టి వ్యక్తికి అనుచితమైన కష్టము కలుగునని అభిప్రాయపడినచో, పెనాల్టీ రాబట్టుటకు సంరక్షణగా తాను అవసరమని భావించునట్టి షరతుల విధింపుకు లోబడి అట్టి డిపాజిటును, అపీలు ట్రిబ్యునలు, మినహాయించవచ్చును.