పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ (2) ఉప పరిచ్ఛేదము (1) క్రింద ప్రతీ అపీలు, వ్యధితుడైన వ్యక్తికి, ఆధినిర్ణయం అధికారి లేక సముచిత కమీషను ద్వారా ఇచ్చిన ఉత్తర్వు యొక్క ప్రతి అందిన తేదీ నుండి నలుబది అయిదు రోజుల కాలావధి లోపు, దాఖలు చేయవలెను మరియు అది, విహిత పరచబడునట్టి ప్రరూపములో నుండి, అట్టి రీతిలో సత్యాపనము చేయబడి మరియు 'అట్టి ఫీజుతో జతపరచబడి యుండవలెను.

అయితే, అపీలు ట్రిబ్యునలు, అట్టి, కాలావధి లోపు దానిని దాఖలు చేయకుండుటకు తగిన కారణమున్నదని తాను సంతృప్తి చెందినచో, సదరు నలుబది ఐదు రోజుల కాలావధి ముగిసిన పిమ్మట అపీలును స్వీకరించవచ్చును.

(3) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద అపీలు అందిన మీదట, అపీలు చేసుకొనుటకు అపీలు ట్రిబ్యునలు, ఆకర్ణింపబడుటకు, పక్షకారులకు అవకాశము నిచ్చిన మీదట, అపీలు చేసిన ఉత్తర్వులను దృఢపరచుచూ, మార్పు చేయుచూ లేక త్రోసిపుచ్చుచూ దానిపై తాను సబబని భావించునట్టి ఉత్తర్వులను జారీ చేయవచ్చును.

(4) అపీలు ట్రిబ్యునలు, తాను జారీచేసిన ప్రతి ఉత్తర్వు యొక్క ప్రతిని అపీలు పక్షకారులకు మరియు సందర్భానుసారము సంబంధిత అధినిర్ణయ అధికారికి లేక సముచిత కమీషనుకు పంపవలెను.

(5) ఉప పరిచ్ఛేదము (1) క్రింద అపీలు ట్రిబ్యునలు సమక్షమున దాఖలు చేసిన అపీలును సాధ్యమైనంత త్వరితగతిన విచారించవలెను మరియు అపీలు అందిన తేదీ నుండి నూట ఎనభై రోజుల లోపు. అంతిమముగా అపీలును పరిష్కరించుటకు తాను ఆ ప్రయత్నించవలెను.

అయితే, ఏదేని అపీలును, సదరు నూట ఎనభై రోజుల కాలావధి లోపు పరిష్కరించనియెడల, అపీలు ట్రిబ్యునలు, సదరు కాలావధిలోపు అపీలును పరిష్కరించకుండుటకు గల కారణములను వ్రాతపూర్వకముగా వ్రాసి యుంచవలెను.

(6) అపీలు ట్రిబ్యునలు, ఈ చట్టము క్రింద అధినిర్ణయ అధికారి లేక సందర్భాను సారము సముచిత కమీషను ద్వారా చేసిన ఏదేని ఉత్తర్వు యొక్క శాసన మాన్యతను, తన ఔచిత్యము లేక యదార్ధతను పరిశీలించు నిమిత్తము, ఏదేని ప్రొసీడింగుకు సంబంధించి, తనంతట తానుగా లేక ఇతర విధముగా తాను సబబని భావించినచో, అట్టి ప్రొసీడింగుల రికార్డును తెప్పించ వచ్చును మరియు ఆ కేసులో అట్టి ఉత్తర్వును చేయవచ్చును.

112.(1) అపీలు ట్రిబ్యునలు, చైర్-పర్సన్ మరియు ముగ్గురు ఇతర సభ్యులతో కూడి ఉండవలెను.