పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 80/G8 (4) భారత కంప్టోలరు మరియు ఆడిటరు జనరలు లేక ఈ విషయమై అతనిచే నియమించబడిన ఎవరేని ఇతర వ్యక్తిచే ధృవీకరించిన రాజ్య కమీషను యొక్క లెక్కలను, దానిపై ఆడిటు రిపోర్టుతో సహా రాజ్య ప్రభుత్వమునకు వార్షికముగా పంపవలెను. మరియు ప్రభుత్వము అది అందిన పిమ్మట వెంటనే రాజ్య శాసనమండలి యొక్క సనుక్షములో దానిని ఉంచునట్లు చూడవలెను.

105.(1) రాజ్య కమీషను, ప్రతి సంవత్సరమునకు ఒకసారి గత సంవత్సరములో తన కార్యకలాపాల సంక్షిప్త వార్షిక నివేదికను, విహితపరచబడునట్టి ప్రరూపములో మరియు అట్టి సమయములో తయారు చేయవలెను. మరియు ఆ నివేదిక ప్రతులను రాజ్య ప్రభుత్వమునకు పంపవలెను.

(2) ఉప-పరిచ్చేదము (1) క్రింద అందిన నివేదిక యొక్క ప్రతిని, అది అందిన పిమ్మట, వెంటనే రాజ్య శాసనమండలి సమక్షమున ఉంచవలెను.

106. సముచిత కమీషను, ఆ కమీషను యొక్క అంచనా వసూళ్లూ మరియు వ్యయమును చూపుతూ, తదుపరి విత్తీయ సంవత్సరము కొరకు తన బడ్జెటును విహితపరచబడు ప్రతి విత్తీయ సంవత్సరములో అట్టి ప్రరూపములోను మరియు అట్టి సమయములోను తయారు చేయవలెను మరియు దానిని సముచిత ప్రభుత్వమునకు పంపవలెను.

107 (1) కేంద్ర కమీషను, తన కృత్యములను నిర్వర్తించుటలో, వ్రాతపూర్వకముగా తనకు కేంద్ర ప్రభుత్వము ఇచ్చునట్టి ప్రజాహితము కూడియుండు విధాన విషయములో అట్టి ఆదేశములను పాటించవలెను.

(2) ప్రజాహితము కూడియున్న విధాన విషయమునకు సంబంధించి ఏవేని అట్టి ఆదేశమునకు సంబంధించి ఏదేని ప్రశ్న ఉత్పన్నమైనచో, దానిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయము అంతిమమగును.

108 (1) రాజ్య కమీషను తన యొక్క కృత్యములను నిర్వర్తించుటలో, రాజ్య ప్రభుత్వముచే వ్రాతపూర్వకముగా వ్రాసి ఉంచబడినట్టి ప్రజాహితము కలిగియుండు విధాన విషయములలో, అట్టి ఆదేశములను పాటించవలెను.

(2) ప్రజాహితము కలిగియుండు విధాన విషయమునకు సంబంధించి అట్టి ఏదేని ఆదేశము విషయములో ఏదేని ప్రశ్న ఉత్పన్న మైనచో, దాని పై రాజ్య ప్రభుత్వ నిర్ణయము అంతిమమైనదగును.