పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(16) “వినియోగించిన ప్రసారలైన్లు" అనగా 9వ పరిచ్చేదములో నిర్దేశించిన క్యాప్టివ్ విద్యుత్ ఉత్పాదన ప్లాంటు లేక 10వ పరిచ్చేదములో నిర్దేశించిన ఉత్పాదన స్టేషను యొక్క విద్యుత్ లైన్లు లేక విద్యుత్ ప్లాంట్లను ఏవేని ప్రసార లైన్లు లేక సబ్ స్టేషన్లు, లేక ఉత్పాదన స్టేషన్లు లేక సందర్భానుసారముగ లోడ్ సెంటర్ కు జోడించు నిమిత్తము ఒక పాయింటు నుండి మరియొక పాయింటుకు ప్రసారం చేయుటకు అవసరమైన ఏదేని విద్యుత్ సరఫరా లైను అని అర్థము;

(17) “పంపిణీ లైసెన్సుదారు" అనగా తన సరఫరా ప్రాంతములో వినియోగదారులకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటకు పంపిణీ వ్యవస్థను నడుపు మరియు నిర్వహించుట కొరకు ప్రాధికారమీయబడిన లైసెన్సుదారు అని అర్థము;

(18) "పంపిణీ మెయిన్" అనగా ఒక సర్వీసు లైనుతో వెంటనే జోడించుటకు లేక జోడించుటకు ఉద్దేశించిన ఏదేని మెయిన్ యొక్క భాగము అని అర్థము;

(19) "పంపిణీ వ్యవస్థ" అనగా ప్రసార లైన్లపై లేక ఉత్పాదన స్టేషను కనెక్షను మరియు వినియోగదారుల ప్రతిష్టాపనల కనెక్షను పాయింటుకు అందించు పాయింట్ల మధ్య తీగలు మరియు అనుబంధ సౌకర్యముల వ్యవస్థ అని అర్ధము;

(20) "విద్యుత్ లైను" అనగా ఏదేని ప్రయోజనము కొరకు విద్యుచ్ఛక్తి సరఫరాకు వినియోగించిన ఏదేని లైను అని అర్థము మరియు ఈ పదబంధ పరిధిలో,-

(ఎ) ఏదేని అట్టి లైనుకు ఇచ్చిన ఏదేని ఆధారము అనగా ఏదేని కట్టడము, టవరు, స్తంభము, లేక ఇతర వస్తువు లోపల, పైన, ద్వారా లేక నుండి అట్టి ఏదేని లైనుకు ఆధారమిచ్చిన, తీసుకొనిపోయిన లేక నిలిపివేయబడినది; మరియు

(బి) విద్యుత్ సరఫరా నిమిత్తము అట్టి ఏదేని లైనుకు జోడించిన ఏవేని ఉపకరణములు చేరియుండును;

(21) “విద్యుత్ ఇన్‌స్పెక్టర్" అనగా 162వ పరిచ్ఛేదపు, ఉప-పరిచ్చేదము (1) క్రింద సముచిత ప్రభుత్వముచే అట్లు నియమించబడిన వ్యక్తి అని అర్థము మరియు ఇందులో ముఖ్య విద్యుత్ ఇన్‌స్పెక్టరు కూడా చేరియుండును;

(22) "విద్యుత్ ప్లాంటు" అనగా విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ లేక సరఫరా కొరకు వినియోగించిన లేక వాటితో జోడించిన ఏదేని ప్లాంటు, పరికరము, ఉపకరణము లేక పనిముట్టు లేక దాని ఏదేని భాగము అని అర్థము, అయితే ఇందులో-