పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

(ఎ) విద్యుత్ లైను: లేక

(బి) ఏదేని ఆవరణకు సరఫరా చేసిన విద్యుచ్ఛక్తి పరిమాణమును తెలుసుకొనుటకు వినియోగించిన .మీటరు; లేక

(సి) వినియోగదారుని నియంత్రణ క్రింద ఉన్నట్టి విద్యుత్ పరికరము, ఉపకరణము, లేక పనిముట్టు

చేరియుండును.

(23) "విద్యుచ్ఛక్తి అనగా

(ఎ) ఏదేని ప్రయోజనము కొరకు ఉత్పాదన చేయబడిన, ప్రసారం చేయబడిన, సరఫరా చేయబడిన లేక వర్తకం చేయబడిన; లేక

(బి) వార్తాప్రసారం చేయుటకు తప్ప ఏదేని ప్రయోజనము కొరకు వినియోగించిన విద్యుచ్ఛక్తి అని అర్థము;

(24) “విద్యుచ్ఛక్తి సరఫరా కోడ్" అనగా 50వ పరిచ్చేదము క్రింద నిర్దిష్ట పరచిన విద్యుచ్ఛక్తి సరఫరా కోడ్ అని అర్థము;

(25) విద్యుత్ వ్యవస్థ " అనగా ఒకటి లేక అంతకంటే ఎక్కువ.

(ఎ) విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు; లేక

(బి) ప్రసార లైన్లు; లేక

(సి) విద్యుత్ లైన్లు మరియు సబ్ స్టేషన్లు

కలిగియున్న విద్యుత్ ఉత్పాదక కంపెనీ లేక సందర్భానుసారము లైసెన్సుదారు నియంత్రణ క్రింద ఉన్న వ్యవస్థ అని అర్థము; మరియు రాజ్యము లేక, కేంద్రమునకు సంబంధించి వాడబడిన పుడు వాటి రాజ్య క్షేత్రముల లోపలి సమగ్ర విద్యుత్ వ్యవస్థ అని అర్ధము;

(26) "విద్యుచ్ఛక్తి వర్తకుడు " అనగా 12వ పరిచ్ఛేదము క్రింద విద్యుత్ వర్తకమును చేపట్టుటకు మంజూరు చేయబడిన లైసెన్సు గల వ్యక్తి అని అర్థము;

(27) “ఫ్రాంచైజీ" అనగా తమ సరఫరా ప్రాంతములోని ఒక ప్రత్యేక ప్రాంతములో పంపిణీ లైసెన్సుదారు తరఫున విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటకు పంపిణీ లైసెన్సుదారుచే ప్రాధికార మీయబడిన వ్యక్తి అని అర్థము:

(28) “ఉత్పాదన కంపెనీ” అనగా విద్యుత్ ఉత్పాదన కేంద్రమును స్వంతముగా కలిగిన లేక నడుపు లేక నిర్వహించు, నిగమితమొనర్చబడినదైనను లేదా కాకున్నను ఏదేని కం పెనీ లేక నిగమనికాయము లేక అసోసియేషను లేక వైయక్తిక నికాయము లేక కల్పిత న్యాయిక వ్యక్తి అని అర్థము;