పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3/G3

(8). " క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటు అనగా , ప్రాథమికముగా తమ స్వంత వినియోగము కొరకు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయుటకు ఎవ్వరేని వ్యక్తి నెలకొల్పిన విద్యుత్ ఉత్పాదన ప్లాంటు అని అర్థము మరియు ఈ పదబంధ పరిధిలో ఏదేని సహకార సంఘము లేక వ్యక్తుల అసోసియేషను ద్వారా ప్రాధమికముగా అట్టి సహకార సంఘము లేక అసోసియేషను సభ్యుల వినియోగము కొరకు విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయుట కొరకు నెలకొల్పిన విద్యుత్ ప్లాంటు కూడ చేరియుండును.

(9) "కేంద్ర కమీషను" అనగా 76వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1)లో నిర్దేశించిన కేంద్ర విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను అని అర్థము;

(10) " కేంద్ర విద్యుత్ ప్రసార వినియోగము" అనగా 38వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదములు క్రింద కేంద్ర ప్రభుత్వముచే అధి సూచించబడినట్టి ఏదేని ప్రభుత్వ కంపెనీ అని అర్థము;

(11) "చైర్ పర్సన్" అనగా ప్రాధికార సంస్థ లేక సముచిత కమీషను లేక సందర్భానుసారముగ అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ అని అర్థము;

(12) “సహ - ఉత్పాదన" అనగా రెండు లేక అంత కెక్కువ రూపములలో (విద్యుచ్ఛక్తితో సహా) ఉపయోగకరమైన శక్తిని ఏకకాలంలో ఉత్పత్తి చేయు ప్రక్రియ అని అర్థము;

1956లోని 1వది  13) కంపెనీ” అనగా కంపెనీల చట్టము, 1956 క్రింద ఏర్పడి, రిజిస్టరు చేయబడిన కంపెనీ అని అర్థము మరియు ఈ పదపరిధిలో కేంద్ర, రాజ్య లేక ప్రాంతీయ చట్టము క్రింది, ఏదేని నిగమ నికాయము చేరి యుండును.

(14) "సంరక్షణ" అనగా విద్యుత్ సరఫరా మరియు వినియోగములలో సమర్థవంతమైన పనితీరు ద్వారా విద్యుత్ వినియోగములోని ఏదేని తగ్గింపు అని అర్థము;

(15) "వినియోగదారుడు" అనగా ఈ చట్టము లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద ప్రజలకు విద్యుచ్ఛక్తి సరఫరాచేయు వ్యాపారములో నిమగ్నమైన లైసెన్సుదారు లేక ప్రభుత్వము లేక ఎవరేని ఇతర వ్యక్తిచే తన వినియోగము కొరకై విద్యుచ్ఛక్తి ఎవరికి సరఫరా చేయబడినదో ఆ వ్యక్తి అని అర్ధము. మరియు ఈ పద పరిధిలో విద్యుచ్ఛక్తిని పొందు నిమిత్తము లైసెన్సుదారు. ప్రభుత్వము లేక సందర్భాను సారముగ అట్టి ఇతర వ్యక్తి చేపట్టిన పనుల వలన తత్సమయమున ఎవరి ప్రాంగణము లకు మన విద్యుత్ కనెక్షను ఈయబడిందో ఆ వ్యక్తి చేరియుండును.