పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ - 56/G56 (2) ఏదేని సర్వీసు లైను నిర్మించు లేక ఉంచు పనులను అమలు చేయునప్పుడు, లైసెన్సుదారు, పనుల ప్రారంభమునకు పూర్వము నలుబది ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా 'అట్టి పనుల నిర్వహణకు అతని ఉద్దేశమును వ్రాతపూర్వకముగా ఒక నోటీసును టెలిగ్రాఫు ప్రాధికార సంస్థకు పంపవలెను.

భాగము - 9

కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ.

ప్రాధికార సంస్థ యొక్క సంఘటన మరియు కృత్యములు.

70.(1) ఈ చట్టము క్రింద తనకు అప్పగించబడినట్టి కృత్యములను నిర్వర్తించుటకు మరియు అట్టి విధులను నిర్వహించుటకు, కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థగా పిలువబడు ఒక నికాయము నుండవలెను.

(2) విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 యొక్క 3వ పరిచ్ఛేదము క్రింద స్థాపించబడి, నియతము చేసినట్టి తేదీకి అవ్యవహిత పూర్వము పనిచేయుచున్న కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ, ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ అయి ఉండవలేను మరియు చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి మరియు దాని యొక్క ఇతర అధికారులు మరియు ఉద్యోగులు, ఈ చట్టము క్రింద నియమించబడి నట్లుగా భావించబడవలెను మరియు విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 క్రింద నియమించబడిన వారు అవే నిబంధనలు మరియు షరతుల పై పదవియందు కొనసాగ వలెను.

(3) ప్రాధికార సంస్థ చైర్ పర్సన్ తోసహా పదునాలుగు మంది సభ్యులకు మించ కుండా ఉండవలెను, వారిలో ఎనిమిది మందికి తక్కువ కాకుండా కేంద్ర ప్రభుత్వము ద్వారా నియమించబడు పూర్తికాలిక సభ్యులుగా ఉండవలెను.

(4) కేంద్ర ప్రభుత్వము, ప్రాధికార సంస్థ యొక్క సభ్యుడుగా నియమించబడు టకు అర్హతగల ఎవరేని వ్యక్తిని, ప్రాధికార సంస్థ చైర్ పర్సన్ గా నియమించవచ్చును. లేక పూర్తికాలిక సభ్యులలో ఒకరిని ప్రాధికార సంస్థ చైర్ పర్సన్ గా పదాభిదానము చేయవచ్చును.

(5) ప్రాధికార సంస్థ సభ్యులను, ఇంజనీరింగు, విత్తీయ, వాణిజ్య, విత్తీయ లేక పారిశ్రామిక విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ, పరిజ్ఞానమును కలిగియుండి, చాలినంత అనుభవము మరియు హోదా కలిగి, సామర్ధ్యము, సమగ్రత, స్థాయి కలిగిన వ్యక్తుల నుండి నియమించబడవలెను. మరియు కనీసము ఒక సభ్యుడిని ఈ క్రింది తరగతులలో నుండి ఒక్కొక్కరిని నియమించవలెను.