పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

551 G35 (6) ఉప పరిచ్ఛేదము (5), క్రింది దరఖాస్తును పరిష్కరించునపుడు, ఆ ఉప-పరిచ్చేదము క్రింద, నిర్దిష్ట పరచిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు లేక ప్రాధికారి, ఉపరితల మార్గమును వేయుటకు పూర్వము. ఉన్నటువంటి ఏదేని చెట్టు విషయములో, ఆ చెట్టుపై హితము కలిగిన వ్యక్తికి తాను సబబని భావించునట్టి నష్టపరిహారమును అధినిర్ణయించ వచ్చును మరియు అట్టి వ్యక్తి లైసెన్సుదారుని వద్ద నుండి దానిని రాబట్టుకొనవచ్చును.

విశదీకరణ: - ఈ పరిచ్ఛేదము నిమిత్తము, “చెట్టు" అను పదబంధములో ఏదేని. పోద, కంచె, అడవి పెరుగుదల లేక ఇతర మొక్కలు చేరియుండును.

69.(1) ఒక లైసెన్సుదారు, సర్వీసు లైన్లు లేక విద్యుచ్ఛక్తి లైన్లు లేక విద్యుచ్ఛక్తి ప్లాంటు కానట్టి ఏదేని టెలిగ్రాఫు లైను, విద్యుచ్ఛక్తి లైను, విద్యుచ్ఛక్తి ప్లాంటు లేక ఇతర పనులను పదిమీటర్ల లోపల నిర్మించుట లేక ఉంచుటకు పూర్వము, పనుల యొక్క స్వభావము లేక స్థితిని మార్చకుండ మరమ్మత్తు, నవీకరణ మరియు సవరణ కొరకు, -

(ఎ) కేంద్ర ప్రభుత్వముచే పదాభిదానము చేయబడు ఒక ప్రాధికారికి నూతన ప్రతిష్టాపన విషయములో ప్రతిపాదనను పంపవలెను. మరియు అట్టి ప్రాధికారి ముప్పది దినముల లోపు ఆ ప్రతిపాదన పై నిర్ణయమును తీసుకొనవలెను;

(బి) ఈ క్రింది వాటిని నిర్దిష్ట పరుస్తూ, ప్రస్తుతము ఉన్న పనుల మరమ్మత్తు, నవీకరణ లేక సవరణ విషయములో టెలిగ్రాఫు ప్రాధికారికి పది దినములకు తక్కువ కానట్టి వ్రాత పూర్వక నోటీసును ఇవ్వవలెను,-

(i) పనుల యొక్క తీరు లేక ప్రతిపాదిత మార్పులు,

(ii) పనులను వినియోగించుకొను రీతి;

(iii) మొత్తము మరియు విద్యుచ్ఛక్తి ప్రసారము చేయబడు స్వభావము;

(iv) భూమి పై రాబడి (ఏదేని ఉన్నచో) దానిని ఏ మేరకు వినియోగించవలెనో మరియు దాని రీతి;

మరియు లైసెన్సుదారు, అట్టి పనులు లేక మార్పుల ద్వారా ఏదేని టెలిగ్రాఫు లైను తీవ్రముగా హానికి గురియగుట నుండి కాపాడుట కొరకు ఆ కాలావధిలో టెలిగ్రాఫు ప్రాధికార సంస్థ ద్వారా సాధారణముగాగాని లేక ప్రత్యేకముగాగాని చేయబడు అట్టి యుక్తమైన అవసరాలకు అనుగుణముగా నుండవలెను.

అయితే, ఏదేని విద్యుచ్ఛక్తి లైన్లు లేక విద్యుచ్ఛక్తి ప్లాంటు లేక లైసెన్సుదారు యొక్క ఇతర పనులలో లోపాలకు సంబంధించి అత్యవసర పరిస్థితుల (టెలిగ్రాఫు ప్రాధికార సంస్థలకు వ్రాతపూర్వకముగా లైసెన్సుదారుచే పేర్కొనబడిన) విషయములలో, లైసెన్సు దారు. ప్రతిపాధిత కొత్త పనులు లేక మార్పుల కొరకు ఏర్పడిన అవసరముల పిమ్మట సాధ్యమైనంత మేరకు అట్టి నోటీసును మాత్రమే ఇవ్వవలసి యుండును.