పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 57/457 (ఎ) ఉత్పాదన స్టేషన్ల యొక్క డిజైను, నిర్మాణము, నడిపించుట మరియు నిర్వహించుటలో ప్రత్యేక నైపుణ్యత కలిగిన ఇంజనీరు:

(బి) విద్యుచ్ఛక్తి యొక్క ప్రసారము మరియు సరఫరాలో ప్రత్యేక నైపుణ్యతను కలిగిన ఇంజనీరింగు;

(సి) విద్యుచ్ఛక్తి రంగములో అనువర్తిత పరిశోధన:

(డి) అనువర్తిత అర్ధశాస్త్రము, అకౌంటింగు, వాణిజ్య శాస్త్రము మరియు విత్తీయ శాస్త్రము.

(6) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్ మరియు ఇతర సభ్యులందరు. కేంద్ర ప్రభుత్వ అభీష్టము మేరకు పదవి యందు కొనసాగవలెను.

(7) చైర్ పర్సన్, ప్రాధికార సంస్థ యొక్క ప్రధాన కార్యనిర్వాహకుడై ఉండవలెను.

(8) ప్రాధికార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము ఢిల్లీలో ఉండవలెను.

(9) ప్రాధికార సంస్థ, చైర్ పర్సన్ ఆదేశించునట్టి సమయములో ప్రధాన కార్యాలయము లేక ఏదేని ఇతర స్థలములో సమావేశము కావలేను మరియు ఆ సంస్థ నిర్దిష్ట పరచు (తన సమావేశములందు ఉండవలసిన కోరంతోసహా) తన సమావేశములలో వ్యాపార కార్యకలాపములు విషయములో అట్టి ప్రక్రియా నియమావళిని పాటించవలెను.

(10) చైర్ పర్సన్ లేక అతను ప్రాధికార సంస్థ యొక్క సమావేశమునకు హాజరు కాలేనపుడు, ఈ విషయములో చైర్ పర్సన్ ద్వారా నామనిర్దేశము చేయబడు ఎవరేని ఇతర సభ్యుడు మరియు అట్టి నామనిర్దేశము చేయని యెడల లేక చైర్ పర్సన్ లేనిచో, హాజరయిన వారిలో నుండి సభ్యులచే ఎంపిక చేయబడిన ఎవరేని సభ్యుడు, సమావేశము నకు అధ్యక్షత వహించవలెను.

(11) ప్రాధికార సంస్థ యొక్క ఏదేని సమావేశము సమక్షమున ఉత్పన్నమగు అన్ని ప్రశ్నలు హాజరయి, ఓటింగు చేసిన సభ్యుల మెజారిటీ ఓటింగుపై నిర్ణయించబడ వలెను. మరియు సమానమైన ఓట్లు వచ్చిన సందర్భములో, చైర్ పర్సన్ లేక అధ్యక్షత వహించిన వ్యక్తికి రెండవ లేక నిర్ణాయక ఓటును వినియోగించుటకు హక్కు కలిగి ఉందురు.

(12) ప్రాధికార సంస్థ యొక్క అన్ని ఉత్తర్వులు మరియు నిర్ణయాలు, ఈ విషయములో చైర్ పర్సన్ ద్వారా ప్రాధికారమీయబడిన ప్రాధికార సంస్థ యొక్క కార్యదర్శి లేక ఎవరేనీ ఇతర అధికారిచే ఆధిప్రమాణీకృత మొనర్చబడవలెను.