పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 54 654.

ఉపరితల మార్గములకు సంబంధించి నిబంధనలు

68.(1) ఉపరితల మార్గము, సముచిత ప్రభుత్వ పూర్వానుమతితో, ఉpa-పరిచ్చేదము (2) నిబంధనల ప్రకారము భూమి పై ఎత్తులో ఉండునట్లు అమర్చునట్లు లేక అమర్చబడు నట్లు చూడవలెను.

2 (2) ఉప-పరిచ్చేదము (1)లో నిబంధనలేవియు,-

(ఎ) 11 కిలో వోల్టులకు మించనట్టి నామమాత్రపు వోల్టేజి గల విద్యుత్తు లైను మరియు ఒకే వినియోగదారుని సరఫరా కొరకు వినియోగించెడు. లేక వినియోగమునకు ఉద్దేశింపబడు విషయములో,

(బి) దానిని ప్రతిష్టాపించుట కొరకు బాధ్యుడగు వ్యక్తి యొక్క ఆక్రమణ లేక నియంత్రణలో నున్న స్థలము యందున్న లేక ఉండెడు ఒక విద్యుత్ లైను అంతటికి సంబంధించి; లేక

(సీ) విహితపరచబడునట్టి ఇతర సందర్భములకు

వర్తించదు.

(3) సముచిత ప్రభుత్వము, ఉప పరిచ్ఛేదము (1)క్రింద అనుమతిని మంజూరు చేయునపుడు, లైను యొక్క యాజమాన్యము మరియు నిర్వహణ షరతులతో సహా), తనకు అవసరమని తోచునట్టి షరతులను విధించవలెను.

(4) సముచిత ప్రభుత్వము, తనచే మంజూరు చేయబడిన అనుమతిలో నియతమైనట్టి కాలావధి ముగింపు పిమ్మట ఏదేని సమయములో అనుమతిని మార్చవచ్చును లేక ప్రతిసంహరించవచ్చును.

(5) సముచిత ప్రభుత్వము చే నిర్దిష్టపరచబడిన ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు లేక ప్రాధికారి "విద్యుచ్ఛక్తిని పంపు లేక ప్రసారము చేయు లేక ఏవేని పనులను చేయుటకు వీలుకలిగించుటలో జోక్యము చేసికొనినను లేక ఆటంకపరచినను లేక జోక్యము చేసికొనుటకు లేక ఆటంకపరచుటకు అవకాశమున్నచో లైనును వేసిన పిమ్మట ఉపరితల మార్గము దగ్గర వేసిన లేక పడి ఉన్న ఏదేని చెట్టు లేక వేయబడి ఉపరితలమార్గము దగ్గర నిలబడియున్న ఏదేని నిర్మాణము లేక ఇతర వస్తు విషయము ఉన్నచో, లైసెన్సుదారు దరఖాస్తు చేసికొనిన మీదట, అతను లేక తాను సబబని భావించినచో చెట్టును, నిర్మాణమును లేక వస్తువిషయ మును తొలగించవచ్చును లేక ఇతర విధముగా వ్యవహరించవచ్చను.