పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ (జె) వీధులు, రైల్వేలు, ట్రామ్ వేలు, మురుగు నీటి కాలువలు, డ్రైయిన్లు, సొరంగాల పనులకు సంబంధించి కంచెవేయుట, సంరక్షణకు, లైటింగు మరియు ఇతర సురక్షిత చర్యలకైన ప్రక్రియ మరియు వాటి తక్షణ పునరుద్దరణ;

(కె) పబ్లిక్ న్యూ సెన్స్, పరిసరాల చెరుపు మరియు అట్టి పనుల వలన పబ్లికు మరియు ప్రైవేటు ఆస్తులకు అనవసరమైన నష్టములను కలిగించుట మానుకొనవలెను.

(ఎల్) సముచిత ప్రభుత్వము, లైసెన్సుదారు లేక స్థానిక ప్రాధికార సంస్థ చే మరమ్మత్తు చేయలేని పనులను చేపట్టుట కైన ప్రక్రియ:

(ఎమ్) ఏవేని రైల్వే, ట్రామ్ వేలు, జలమార్గములు మొదలగువాటి పునరుద్ధరణ కొరకు అవసరమగు మొత్తములను డిపాజిటు చేయు రీతి;

(ఎన్) అట్టి పనుల ద్వారా ప్రభావితమైన ఆస్తిని పునరుద్ధరించు రీతి మరియు దాని నిర్వహణ,

(ఒ) లైసెన్సుదారుచే చెల్లించవలసియుండు నష్ట పరిహారమును డిపాజిటు చేయు ప్రక్రియ మరియు సెక్యూరిటీని ఇచ్చుట; మరియు

(పి) ఈ పరిచ్ఛేదము క్రింద పనుల యొక్క నిర్మాణమునకు మరియు నిర్వహణకు ఆనుషంగీకమైన లేక పారిణామికమైనట్టి ఇతర విషయములు.

(3) లైసెన్సుదారు, ఈ పరిచ్చేదము ద్వారా లేక దాని క్రింద మరియు వాటి క్రింద చేసిన నియమముల ద్వారా ఒసగబడిన ఏవేని అధికారములను వినియోగించుచు, వీలైనంత తక్కువ చెరుపును, నష్టమును మరియు అసౌకర్యమును కలిగించవలెను. మరియు అతని ద్వారా లేక అతనిచే నియమింపబడిన ఎవరేని ద్వారా జరిగిన ఏదేని చెరుపు, నష్టము, లేక అసౌకర్యమునకుగాని పూర్తి నష్టపరిహారమును చెల్లించవలెను.

(4) (ఉప-పరిచ్ఛేదము (3) క్రింది నష్టపరిహారపు మొత్తముతో సహా) ఏదేని వ్యత్యాసము లేక వివాదము ఈ క్రింది పరిచ్చేదము క్రింద ఏర్పడినచో, ఈ విషయమును సముచిత కమీషను ద్వారా నిర్ధారించబడవలెను.

(5), సముచిత కమీషను, ఉప-పరిచ్ఛేదము (3) క్రింద ఏదేని నష్టపరిహారము నకు అదనముగా ఈ పరిచ్ఛేదము క్రింద ఏర్పడిన ఏదేని వ్యత్యాసము లేదా వివాదమును నిర్ధారించునపుడు, ఆ ఉప-పరిచ్ఛేదము క్రింద చెల్లించవలసిన నష్టపరిహారపు మొత్తమునకు మించనట్టి పెనాల్టీని విధించవచ్చును.