పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

దానిని తిరిగి ఉంచుట, మరమ్మతు చేయుట లేక నిర్వహించుటను నమోదు చేయుటకుగాను విద్యుచ్చక్తి సరఫరా కోడ్ నొకదానిని నిర్దిష్ట పరచవలెను.

51. పంపిణీ లైసెన్సుదారుడు, సముచిత కమీషనుకు ముందు తెలియజేయుట ద్వారా తన ఆస్తుల అత్యం తానుకూలమైన వినియోగము కొరకు ఏదేని ఇతర వ్యాపారములో వ్యాపారములు నిమగ్నం కావచ్చును.

అయితే, అట్టి వ్యాపారము నుండి లభించిన రెవిన్యూ యొక్క అనుపాతము సంబంధిత రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి విధముగా తమ వీలింగు ఛార్జీలను తగ్గించుటకు వినియోగించబడవ లేను.

అంతేకాక, పంపిణీ లైసెన్సుదారు పంపిణీ వ్యాపారము ఏదేని మార్గములో అట్టి వ్యాపార సంస్థకు విత్తీయ సహాయము అందించుటగాని లేక ఏదేని మార్గములో అట్టి వ్యాపారమును పోషించుటకు తన పంపిణీ ఆస్తులపై భారము పడకుండ జాగ్రత్త వహించుటకు అట్టి ప్రతియొక వ్యాపారము కొరకై ప్రత్యేక లెక్కలు నిర్వహించవలెను.

అంతేకాక, ఈ పరిచ్ఛేదములో నున్నదేదియు ఈ చట్టము యొక్క ప్రారంభమునకు పూర్వం విద్యుచ్ఛక్తి యొక్క పంపిణీ వ్యాపారములో నిమగ్నమైన స్థానిక ప్రాధికార సంస్థకు కూడా వర్తించరాదు.

విద్యుచ్ఛక్తి వర్తకులకు సంబంధించిన నిబంధనలు.


52(1) 12వ పరిచ్ఛేదము యొక్క ఖండము (సి)లో యున్నట్టి నిబంధనలకు ఈ భంగము కలుగకుండ, సముచిత కమీషను, విద్యుచ్ఛక్తి వర్తకుడిగా ఉండుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానము, తగినంత మూలధన లభ్యత మరియు పరపతి యోగ్యతలను నిర్దిష్టపరచవలెను.

(2) ప్రతియొక విద్యుచ్ఛక్తి వర్తకుడు, సముచిత కమీషనుచే నిర్దిష్టపరచబడు నట్టి విధముగా విద్యుచ్ఛక్తి సరఫరా మరియు వర్తకమునకు సంబంధించినట్టి కర్తవ్యములను నిర్వర్తించవలెను.

సాధారణ సరఫరాకు సంబంధించిన నిబంధనలు

53. ప్రాధికార సంస్థ, రాజ్య ప్రభుత్వముతో సంప్రదించి,

(ఎ) (ఉత్పాదన, ప్రసారము లేక పంపిణీ లేక వర్తకములో నిమగ్నమైన వ్యక్తులతో సహా) విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము లేక పంపిణీ లేక వర్తకము నుండి ఉత్పన్న మైన అపాయములు లేక సరఫరా చేసిన విద్యుచ్ఛక్తి వినియోగము లేక ఏదేని విద్యుత్ లైను లేక ప్లాంటు ప్రతిష్టాపన నిర్వహణ లేక వినియోగము నుండి ప్రజలను సంరక్షించుటకు;