పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

(బి) ఎవరేని వ్యక్తికి వ్యక్తిగత హాని లేక ఎవరేని వ్యక్తి యొక్క ఆస్తికి నష్టము లేక అట్టి ఆస్తి వినియోగములో జోక్యమును తొలగించుట లేక నష్టపూచీలను తగ్గించుట;

(సి) నిర్దిష్ట పరచబడునట్టి ప్రమాణములకు అనుగుణమైన వ్యవస్థాపరమైన సాధనముల ద్వారా తప్ప విద్యుచ్ఛక్తి సరఫరా లేక ప్రసారమును నిషేధించుట;

(డి) విద్యుచ్ఛక్తి సరఫరా లేక ప్రసారములలోని ప్రమాదములు మరియు వైఫల్యములను నిర్దిష్ట పరచిన ప్రరూపములో సముచిత కమీషను మరియు విద్యుత్ ఇన్-స్పెక్టరుకు నోటీసు నిచ్చుట; -

(ఇ) విద్యుచ్ఛక్తి సరఫరా లేక ప్రసారమునకు సంబంధించిన పటములు, ప్రణాలికలు మరియు విభాగములను ఉత్పాదన కంపెనీ లేక లైసెన్సుదారు ఉంచుకొనుట;

(ఎఫ్) దానిచే ప్రాధికార మీయబడిన ఎవరేని వ్యక్తి లేక విద్యుత్ ఇన్-స్పెక్టరు లేక నిర్దిష్ట పరచిన ఫీజు చెల్లింపుపై ఎవరేని వ్యక్తిచే పటముల, ప్రణాళికలు మరియు విభాగముల తనిఖీ;

(జి) వ్యక్తిగత హాని లేక ఆస్తికి నష్టము లేక దాని వినియోగములో జోక్యమును తొలగించు లేక నష్ట పూచీలను తగ్గించు నిమిత్తము వినియోగదారుడి నియంత్రణ క్రింద ఏదేని విద్యుత్ లైను లేక విద్యుత్ ప్లాంటు లేక ఏదేని విద్యుత్ పరికరణమునకు సంబంధించి తీసుకొనవలసిన చర్యను నిర్దిష్ట పరచుట కొరకు

తగిన చర్యలను నిర్దిష్ట పరచవచ్చును.

54.(1) ఈ చట్టము క్రింద ఇతర విధముగా మినహాయించబడిననే తప్ప, కేంద్రప్రసార వినియోగము లేక రాజ్య ప్రసార వినియోగము లేక లైసెన్సుదారు కాని ఏ ఇతర వ్యక్తియు,

(ఎ) ఏదేని వీధిలో, లేక

(బి) ఏదేని స్థలములో,

(i) సాధారణముగా ఒక వంద లేక అంతకెక్కువ వ్యక్తులు సమావేశమగుటకు అవకాశము యున్నట్టి; లేక

(ii) ఫ్యాక్టరీల చట్టము, 1948 యొక్క అర్ధము లోపల ఫ్యాక్టరీ లేక గనుల చట్టము, 1952 యొక్క అర్థము లోపల గని యున్నట్టి; లేక

(iii) రాజ్య ప్రభుత్వము, సాధారణ లేక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఈ ఉప పరిచ్ఛేదపు నిబంధనలు వర్తించునని ప్రఖ్యానించునట్టి;