పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 421:04. (3) ఉప-సరిచ్ఛేదము (2)లో నిర్దేశించిన వ్యక్తి అట్టి సెక్యూరిటీని ఇచ్చుటలో వైఫల్యము చెందినచో పంపిణీ లైసెన్సుదారు సబబని భావించినచో వైఫల్యము కొనసాగిన కాలావధిలో విద్యుచ్ఛక్తి సరఫరాను నిలిపివేయవచ్చును.

(4) పంపిణీ లైసెన్సుదారు. ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించిన సెక్యూరిటీ పై బ్యాంకు రేటుకు సమానముగా లేక అంత కెక్కువ సంబంధిత రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడినట్లుగా వడ్డీని చెల్లించవలెను. మరియు అట్టి సెక్యూరిటీని ఇచ్చిన వ్యక్తి అభ్యర్ధనపై సదరు సెక్యూరిటీని వాపసు చేయవలెను.

(5) పంపిణీ లైసెన్సుదారు, సరఫరాను కోరుచున్న వ్యక్తి ముందు చెల్లింపు జరిగిన మీటరు ద్వారా సరఫరాను తీసుకొనుటకు సంసిద్ధుడైనచో, ఉప పరిచ్చేదము (1)లోని ఖండము (ఎ)ను పురస్కరించుకొని సెక్యూరిటీని కోరుటకు హక్కు కలిగి యుండడు.

48. పంపిణీ లైసెన్సుదారు, 43వ పరిచ్ఛేదమును పురస్కరించుకొని విద్యుచ్ఛక్తి సరఫరాను కోరుచున్న ఎవరేని వ్యక్తిని,-

(ఎ) 53న పరిచ్ఛేదము క్రింద చేసిన వినియమములను పంపిణీ లైసెన్సుధారు పాటించుటకు వీలు కల్పించు నిమిత్తము విధించిన ఏవేని నిర్బంధనలు;

(బి) విద్యుచ్ఛక్తి సరఫరా చేయబడిన వ్యక్తి యొక్క నిర్లక్ష్యం ఫలితంగా వాటిల్లిన విత్తీయ నష్టమునకు పంపిణీ లైసెన్సుదారు యొక్క ఏదేని దాయిత్వమును పరిమితము చేయుటకైన ఏవేని నిబంధనలు

అంగీకరించమని కోరవచ్చును.

49. 42వ పరిచ్చేదము క్రింద కొందరు వినియోగదారులకు సముచిత కమీషను ప్రవేశ సౌలభ్యము అనుమతించిన యెడల, సదరు వినియోగదారులు, 62వ పరిచ్చేదములోని ఉప పరిచ్చేదము (1) యొక్క ఖండము (డి)లో ఉన్న నిబంధనలలో ఏమి ఉన్నప్పటికిని,(టారిఫుతో సహా) వారు అంగీకారము కుదుర్చు కున్నట్టి నిబంధనలు మరియు షరతులపై విద్యుచ్ఛక్తి సరఫరా లేక కొనుగోలు కొరకు ఎవరేని వ్యక్తితో కరారును కుదుర్చుకొనవచ్చును.

50. రాజ్య కమీషను. విద్యుచ్ఛక్తి ఛార్జీల వసూలు, విద్యుచ్ఛక్తి ఛార్జీల బిల్లింగ్ కొరకు కాలావధులు, వాటిని చెల్లించని కారణంగా విద్యుచ్ఛక్తి సరఫరా నిలిపివేయుట, విద్యుచ్ఛక్తి సరఫరా పునరుద్ధరణ, విద్యుత్ ప్లాంటును లేక విద్యుత్ లైను లేక మీటరును అక్రమంగా మార్చుట, ఆపద లేక నష్టం కలిగించుట నుండి నివారించుటకు చర్యలు, పంపిణీ లైసెన్సుదారు లేక సరఫరాను నిలిపి వేయుట కొరకు మరియు మీటరును తొలగించుటకు ఈ విషయమై అతడి తరఫున పనిచేయుచున్న ఎవరేని వ్యక్తి నమోదు కొరకు, విద్యుత్ లైన్లు లేక విద్యుత్ ప్లాంట్లు లేక మీటరు మరియు అట్టి ఇతర విషయములకు సంబంధించి వేరొక