పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2/G2

(2) "నియత తేదీ " అనగా కేంద్ర ప్రభుత్వము అధిసూచన ద్వారా నియతము చేసిన తేదీ అని అర్థము;

(3) "సరఫరా ప్రాంతము" అనగా ఏప్రాంతములో విద్యుత్ పంపిణీ లైసెన్సుదారు, తనకీయబడిన విద్యుచ్ఛక్తి సరఫరా లైసెన్సు ద్వారా పంపిణీకి ప్రాధికారము వుండునో ఆ ప్రాంతము అని అర్థము;

(4) “సముచిత కమీషను " అనగా 76వ పరిచ్చేదపు ఉప పరిచ్ఛేదము (1)లో పేర్కొనిన కేంద్ర క్రమబద్ధీకరణ కమీషను లేక 82వ పరిచ్ఛేదములో పేర్కొనిన రాజ్య క్రమబద్ధీకరణ కమీషను లేక సందర్భానుసారముగా 83వ పరిచ్ఛేదములో పేర్కొనిన సంయుక్త కమీషను అని అర్థము;

(5) "సముచిత ప్రభుత్వము " అనగా -

(ఎ)(i) పూర్ణతః లేక భాగతః స్వామిత్వము కలిగియున్న ఉత్పాదక కంపెనీ విషయంలో;

(ii) అంతర్ రాజ్య విద్యుత్ ఉత్పాదన, ప్రసారము. వ్యాపారం, లేక సరఫరా విషయములో మరియు ఎవేని గనులు, చమురు క్షేత్రాలు, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానాశ్రయములు, తంతితపాలా. ప్రసారం కేంద్రాలు మరియు ఏనేని రక్షణ పనులు, నౌకా నిర్మాణ కేంద్రము, అణువిద్యుత్ ప్రతిష్టాపనల విషయంలో;

(iii) జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం మరియు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము విషయంలో;

(iv) దానికి చెందిన లేక దాని నియంత్రణ క్రింద ఏవేని పనులు లేక విద్యుత్ ప్రతిష్టాపనల విషయంలో;

కేంద్ర ప్రభుత్వము అనియూ;


(బి) ఇతర సందర్భములో, ఈ చట్టము క్రింద అధికారిత కలిగిన రాజ్య ప్రభుత్వము, అనియూ అర్థము.

(6) "ప్రాధికార సంస్థ" అనగా 70వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1)లో పేర్కొనిన కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ అని అర్థము;

1948 లో 54వది 

(7) “బోర్డు", అనగా ఈ చట్టము ప్రారంభమునకు ముందు విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 యొక్క 5వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద ఏర్పాటు చేయబడిన రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డు అని అర్థము;