పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యుచ్ఛక్తి చట్టం - 2003

(2008లోని 36వ చట్టము )

[26 మే, 2003]

విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము, పంపిణీ, వ్యాపారం మరియు వినియోగము లకు సంబంధించిన శాసనములను ఏకీకరించుటకు మరియు సాధారణముగా విద్యుచ్ఛక్తి పరిశ్రమను అభివృద్ధిపరచుటకు దోహదపడు చర్యలు చేపట్టుట, దానికి పరిశ్రమలో పోటీని ప్రోత్సహించుటకు, వినియోగదారుల హితములను పరిరక్షించుటకు, విద్యుచ్ఛక్తిని అన్ని ప్రాంతములకు సరఫరా చేయుటకు, విద్యుచ్ఛక్తి టారిఫును హేతుబద్ధీకరించుటకు సబ్సిడీలకు సంబంధించి పారదర్శక విధానాలను నిశ్చయించుటకు, సమర్థవంతమైన మరియు పర్యావరణానుకూల విధానాలను అనుసరించుటకు, కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థను, క్రమబద్ధీకరణ కమీషన్లను ఏర్పాటు చేయుటకు, అపీలు ట్రిబ్యునలు స్థాపించుటకు మరియు వాటికి సంబంధించిన లేక ఆనుషంగికమైన విషయములను నిబంధించుట కొరకైన చట్టము.

భారత గణరాజ్యము యొక్క ఏబది నాలుగవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది.

భాగము -1

ప్రారంభిక

సంగ్రహనామము, విస్తరణ మరియు ప్రారంభము. 

1 (1) ఈ చట్టమును విద్యుచ్ఛక్తి చట్టము, 2003 అని పేర్కొనవచ్చును.

(2) ఇది జమ్ము మరియు కాశ్మీరు రాజ్యము మినహా, భారత దేశమంతటికి విస్తరించును.

(3) ఇది, కేంద్రప్రభుత్వము అధినూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన 10.6.2003, 121వ పరిచ్చేదము మినహా ఎస్.ఓ.నెం.669(ఈ), తేదీ 10.6.2003 ద్వారా అమలులోనికి వచ్చును.

అయితే, ఈ చట్టపు వేర్వేరు నిబంధనల కొరకు వేర్వేరు తేదీలను నియతము చేయవచ్చును మరియు ఈ చట్టము ప్రారంభమును గూర్చి అట్టి ఏదేని నిబంధనలో చేసిన నిర్దేశమును, ఆ నిబంధన అమలులోనికి వచ్చుటకు చేసిన నిర్దేశముగా అన్వయించవలెను.

నిర్వచనములు. 

2. ఈ చట్టములో, సందర్భము వేరు విధముగా ఉన్ననే తప్పు.-

(1) "అపీలు ట్రిబ్యునలు " అనగా 110వ పరిచ్ఛేదము క్రింద స్థాపించబడిన విద్యుచ్ఛక్తి అపీలు ట్రిబ్యునలు అని అర్థము:

1/G1