పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ - 311 G31 32.(1) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము, రాజ్యములో విద్యుత్ వ్యవస్థ సమీకృత నిర్వహణకై జాగ్రత్త వహించుటకు అత్యున్నత నికాయముగా ఉండవలెను.

(2) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము,-

(ఎ) రాజ్యములో పనిచేయుచున్న లైసెన్సుదారులు లేక ఉత్పాదన కంపెనీలతో కుదుర్చుకున్న కాంట్రాక్టులననుసరించి రాజ్యములోపల అంత్యంలానుకూల కాలనిర్ణయ పట్టికలు మరియు విద్యుచ్ఛక్తి డిస్పాచ్ కొరకై బాధ్యత వహించవలెను;

(బి). గ్రిడ్ నిర్వహణలను మానిటర్ చేయవలెను.

(సి) రాజ్య గ్రిడ్ ద్వారా ప్రసారం చేయబడిన విద్యుచ్ఛక్తి పరిమాణమును గూర్చిన లెక్కలను నిర్వహించవలెను;

(డి) రాజ్యాంతర్గత ప్రసార వ్యవస్థను పర్యవేక్షించవలెను. మరియు నియంత్రించవలెను, మరియు

(ఇ) గ్రిడ్ నియంత్రణ కొరకు వాస్తవంగా నెరవేర్చుటలో యుంచిన సమయమును. అమలు చేయుటకు మరియు గ్రిడ్ ప్రమాణములు మరియు రాజ్య గ్రిడ్ కోడ్ ననుసరించి రాజ్య గ్రిడ్ ను సురక్షితముగాను మరియు పొదుపుగాను నిర్వహించుట ద్వారా రాజ్యము లోపల విద్యుచ్ఛక్తి డిస్పాచ్ చేయుటకు బాధ్యత వహించవలెను.

(3) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము. రాజ్యాంతర్గత విద్యుచ్ఛక్తి ప్రసారములో నిమగ్నమైన ఉత్పాదన కంపెనీలు మరియు లైసెన్సుదారుల నుండి రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడిన విధముగా ఫీజును మరియు ఛార్జీలను విధించవచ్చును మరియు వసూలు చేయవచ్చును.

33.(1) రాజ్యములో రాజ్యలోడ్ డిస్పాచ్ కేంద్రము, ఆ రాష్ట్రములో సమీకృత గ్రిడ్ నిర్వహణలకు సంబంధించి జాగ్రత్త వహించుటకు మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో గరిష్ట స్థాయిలో పొదువును మరియు సమర్థతను సాధించుటకు అవసరమైనట్టి ఆదేశములను ఈయవచ్చును. మరియు పర్యవేక్షణ మరియు నియంత్రణ చేయవచ్చును.

(2) ప్రతియొక లైసెన్సుదారుడు, ఉత్పాదన కంపెనీ, ఉత్పాదన స్టేషను, సబ్ స్టేషను, మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణతో సంబంధము యున్నట్టి ఎవరేని ఇతర వ్యక్తి, ఉప-పరిచ్ఛేదము - (1) క్రింద రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము చే జారీచేయబడినట్టి ఆదేశములను పాటించవలెను.

(3) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క అ ఆదేశములను పాటించవలెను.