పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ (4) విద్యుచ్ఛక్తి నాణ్యత లేక రాజ్య గ్రిడ్ యొక్క సురక్షితమైన, భద్రతగల మరియు సమీకృత నిర్వహణ లేక ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ఈయబడిన ఏదేని ఆదేశము నకు సంబంధించి ఏదేని వివాధము ఉత్పన్న మైనచో, నిర్ణయము కోరకు దానిని రాజ్య కమీషనుకు నిర్దేశించవలెను.

అయితే, రాజ్య కమీషను నిర్ణయము పెండింగులో ఉండగా రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క ఆదేశములు లైసెన్సుదారు లేక ఉత్పాదన కం పెనీ ద్వారా పాటించబడవలెను.

(5) ఎవరేని లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ లేక ఎనలేని ఇతర వ్యక్తి, ఉప-పరిచ్ఛేదము (1) క్రింద జారీ చేయబడిన ఆదేశములను పాటించుటలో వైఫల్యము చెందినచో, అతడు ఐదు లక్షల రూపాయలకు మించని శాస్త్రికి పాత్రుడగును.

ప్రసారమునకు సంబంధించి ఇతర నిబంధనలు

34. ప్రతియొక ప్రసార లైసెన్నుదారు, ప్రాధికార సంస్థచే నిర్ధిష్ట పరచబడినట్లుగా గ్రిడ్ ప్రమాణముల ననుసరించి ప్రసార లైన్ల కార్యవర్తన మరియు నిర్వహణలకు సంబంధించినట్టి సాంకేతిక ప్రమాణములను పాటించవలెను.

35. సముచిత కమీషను, ఎవరేని లై సెన్సుదారునిచే దరఖాస్తు పై మధ్యలోనున్న ప్రసార సౌకర్యముల స్వామిత్వమును కలిగియున్న లేక వాటిని నిర్వహించుచున్న ఎవలేని ఇతర లైసెన్సుదారుకు, సదరు లైసెన్సుదారు వద్ద లభ్యమగుచున్న మిగులు సామర్ధ్యము మేరకు అట్టి సౌకర్యములను వినియోగించుట కొరకు ఏర్పాట్లు చేయమని ఉత్తరువు ద్వారా కోరవచ్చును.

అయితే, లైసెన్సుదారు వద్ద లభ్యమగుచున్న మిగులు సామర్థ్యము ఎంతమేరకు ఉన్నదను. విషయమునకు సంబంధించిన ఏదేని వివాదము పై సముచిత కమీషనుచే అధి నిర్ణయించబడనలెను.

36.(1) ప్రతియొక లైసెన్సుదారు, 35వ పరిచ్ఛేదము క్రింద చేసిన ఉత్తరువుపై, పరస్పరం అంగీకారము కుదుర్చుకున్న రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతుల పై తన మధ్యలోనున్న ప్రసార సౌకర్యములను సమకూర్చవలెను.

అయితే, లైసెన్సుదారులలో వాటిపై పరస్పర అంగీకారము కుదరనిచో, సముచిత కమీషను, రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతులను నిర్దిష్ట పరచవచ్చును.

(2) ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించిన రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతులు న్యాయముగాను, సముచితముగాను ఉండవలెను మరియు అట్టి సౌకర్యముల వినియోగమున కైన అనుపాతములో కేటాయించవచ్చును.