పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 301 G30 - (5) విద్యుచ్ఛక్తి, నాణ్యత లేక ప్రాంతీయ గ్రిడ్ యొక్క సురక్షితమైన, భద్రతగల మరియు సమీకృత నిర్వహణ లేక ఉప పరిచ్ఛేదము (1) క్రింద ఈయబడిన ఏవేని ఆదేశమునకు సంబధించి ఏదేని వివాదము ఉత్పన్నమైనచో, దానిని నిర్ణయము కొరకు కేంద్ర కమీషనుకు నిర్దేశించవలెను.

అయితే, కేంద్ర కమీషను నిర్ణయము పెండింగులో ఉండగా, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క ఆదేశములు, రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము లేక లైసెన్సుదారుడు లేక సందర్భానుసారముగ ఉత్పాదన కంపెనీ ద్వారా పాటింబడవలేను.

(6) ఎవరేని లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ లేక ఎవరేని ఇతర వ్యక్తి, ఉప పరిచ్చేదము (2) లేక ఉప పరిచ్చేదము (3) క్రింద జారీ చేసిన ఆదేశములను పాటించుటలో వైఫల్యము చెందినచో, అతడు, పదునైదు లక్షల రూపాయలకు మించని శాస్త్రికి పాత్రుడగును.

రాజ్యాంతర్గత ప్రసారము

30. రాజ్య కమీషను. తన రాజ్య క్షేత్ర అధికారితా పరిధిలోపల విద్యుచ్ఛక్తిని పొదుపుగాను మరియు సమర్థనంతముగా వినియోగించుట ద్వారా విద్యుచ్ఛక్తి ప్రసారము మరియు సరఫరా కొరకు సౌకర్యములను కల్పించవలెను మరియు ప్రసారము, సీలింగు మరియు అంతర్ కనెక్షన్ల ఏర్పాట్లను పెంపొందించవలెను.

31 (1) రాజ్య ప్రభుత్వము, ఈ భాగము క్రింద అధికారములను వినియోగించు మరియు కృత్యములను నిర్వర్తించు ప్రయోజనముల నిమిత్తము రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రముగా పిలువబడు కేంద్రము నొకదానిని స్థాపించవలెను.

(2) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము, రాజ్య ప్రభుత్వముచే అధి సూచించబడిన విధముగా ఏదేని రాజ్య చట్టము ద్వారా లేక దాని క్రింద స్థాపించబడిన లేక ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ కంపెనీ లేక ఏదేని ప్రాధికార సంస్థ లేక కార్పొరేషను చే నిర్వహించబడవలెను.

అయితే, రాజ్య ప్రభుత్వముచే ప్రభుత్వ కంపెనీ లేక ఏదేని ప్రాధికార సంస్థ లేక కార్పొరేషను అధి సూచించబడునంత వరకు రాజ్య ప్రసార వినియోగము, రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రమును నిర్వహించవలెను.

అంతేకాక, రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము ఏదియు విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో నిమగ్నం కారాదు.