పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ - 291 G29: (డి). అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థను పర్యవేక్షించవలెను. మురియు నియంత్రించ వలెను; మరియు

(ఇ) గ్రిడ్ నియంత్రణ కొరకు వాస్తవంగా ఉపయోగములో యుంచిన సమయమును అమలు చేయుటకు మరియు గ్రిడ్ ప్రమాణములు మరియు గ్రిడ్ కోడ్ ననుసరించి ప్రాంతీయ గ్రిడ్ ను సురక్షితముగాను మరియు పొదుపుగాను నిర్వహించుట ద్వారా ప్రాంతము లోపల విద్యుచ్ఛక్తి డిస్పాచ్ చేయుటకు బాధ్యత వహించవలెను.

(4) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, అంతర్ రాజ్య విద్యుచ్ఛక్తి ప్రసారములో నిమగ్నమైన ఉత్పాదన కంపెనీలు లేక లైసెన్సుదారుల నుండి కేంద్ర కమీషనుచే నిర్దిష్టపరచబడునట్టి విధముగా ఫీజును మరియు ఛార్జీలను విధించవచ్చును మరియు వసూలు అం చేయవచ్చును.

29 (1) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, తన నియంత్రణ క్రింద ప్రాంతములో గ్రిడ్ క్రియాకలాపముల స్థిరీకరణ మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో గరిష్ఠ స్థాయిలో మితమును మరియు సమర్థతను సాధించుటకు అవసరమైనట్టి ఆదేశములను ఈయవచ్చును, పర్యవేక్షణ మరియు నియంత్రణ చేయవచ్చును.

(2) ప్రతియొక లైసెన్సుదారు, ఉత్పాదన కం పెనీ, ఉత్పాదన స్టేషను, సబ్ స్టేషను మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో సంబంధము యున్నట్టి ఎవరేని ఇతర వ్యక్తి. ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రముచే జారీ చేయబడినట్టి ఆదేశములను పాటించవలెను.

(3) రాజ్య ప్రసార లైన్ల ఎవరేని ప్రసార లైసెన్సుదారు. లేక ఎవరేని ఇతర రాజ్య లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ (అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థకు సంబంధించినవి కానట్టి) లేక రాజ్యములోని సబ్ స్టేషనుకు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రములచే జారీ చేయబడిన ఆదేశములన్నియు రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము ద్వారా జారీ చేయబడ వలెను మరియు రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రములు అట్టి ఆదేశములు లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ లేక సబ్ స్టేషన్ విధిగా పాటించునట్లు జాగ్రత్త వహించవలెను.

(4) ప్రాంతములోని ప్రాంతీయ, విద్యుత్ కమిటీ, ఆ ప్రాంతములో సమీకృత గ్రిడ్ స్థిరత మరియు పాఫీగా నిర్వహణ మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో పొదుపు మరియు సమర్థతకు సంబంధించిన విషయములపై ఎప్పటికప్పుడు ఒక అంగీకారానికి రావలెను.