పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ (3) జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, ఏదేని కేంద్ర చట్టముచే లేక దాని క్రింద స్థాపించబడిన లేక ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ కంపెనీ లేక ఏదేని ప్రాధికార సంస్థ లేక కార్పొరేషనుచే కేంద్ర ప్రభుత్వము ద్వారా అధి సూచించబడినట్లుగా నిర్వహించవలెను.

27.(1) కేంద్ర ప్రభుత్వము, ఈ భాగము క్రింద అధికారములను వినియోగించుట కొరకు మరియు కృత్యములను నిర్వర్తించుట కొరకు 25వ పరిచ్ఛేదము ననుసరించి కేంద్ర ప్రభుత్వముచే నిర్థారించబడినట్లుగా ప్రాదేశిక అధికారితా పరిధి కలిగియుండి ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రముగా పిలువడు కేంద్రము నొకదానిని ప్రతియొక ప్రాంతమునకు స్థాపించవలెను.

2) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, ఏదేని కేంద్ర చట్టము ద్వారా లేక దాని క్రింద స్థాపించబడిన లేక ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ కంపెనీ లేక ఏదేని ప్రాధికార సంస్థ లేక కార్పొరేషను చే కేంద్ర ప్రభుత్వము ద్వారా అధి సూచించబడినట్లుగా నిర్వహించవలెను.

అయితే, ఈ ఉప-పరిచ్ఛేదములో నిర్దేశించిన ప్రభుత్వ కంపెనీ లేక ప్రాధికార సంస్థ లేక కార్పొరేషను కేంద్ర ప్రభుత్వముచే అధిసూచించబడునంత వరకు, కేంద్ర ప్రసార వినియోగము, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రమును నిర్వహించవలెను.

అంతేకాక, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రమేదియు. విద్యుచ్ఛక్తి ఉత్పాదన లేక వర్తక కార్యకలాపములలో నిమగ్నము కారాదు.

28.(1) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, సంబంధిత ప్రాంతములో విద్యుత్ వ్యవస్థ సమీకృత క్రియాకలాపమునకు అత్యున్నత నికాయముగా ఉండవలెను.

(2 ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, వీలింగ్ మరియు అత్యంతానుకూల కాల నిర్ణయ పట్టికలు మరియు గ్రిడ్ కోడ్ లో కేంద్ర కమీషను నిర్దిష్ట పరచినట్లుగా విద్యుచ్ఛక్తి డిస్పాచ్ కు సంబంధించినట్టి సూత్రములు, మార్గదర్శకాలు మరియు పద్ధతులను పాటించ వలెను.

3) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము.-

(ఎ) ప్రాంతములో పనిచేయుచున్న లైసెన్సుదారులు లేక ఉత్పాదన కంపెనీలతో కుదుర్చుకున్న కాంట్రాక్టులననుసరించి ప్రాంతము లోపల అత్యంతానుకూల కాలనిర్ణయ పట్టికలు మరియు విద్యుచ్ఛక్తి డిస్పాచ్ కొరకై బాధ్యత వహించవలెను;

(బి) గ్రిడ్ నిర్వహణలను మానిటర్ చేయవలేను:

(సి) ప్రాంతీయ గ్రిడ్ ల ద్వారా ప్రసారం చేయబడిన విద్యుచ్ఛక్తి పరిమాణమును గూర్చిన లెక్కలను నిర్వహించవలెను;