పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

G25..

21. 20వ పరిచ్ఛేదము లేక 24వ పరిచ్ఛేదము క్రింద వినియోగము అమ్మివేయబడిన యెడల, అమ్మకము పూర్తి అయిన మీదట లేక సందర్భానుసారముగ ఉద్దేశించుచూ కొనుగోలుదారుడికి వినియోగమును ఇచ్చివేసిన తేదీన, ఇందులో ఏది ముందుజరుగునో అప్పుడు,-

(ఎ) వినియోగము, కొనుగోలుదారుడిలో లేక సందర్భానుసారముగ ఉద్దేశించుచున్న కొనుగోలుదారుడిలో ఏదేని అప్పు, తనఖా లేక లైసెన్సుదారుకు లేక వినియోగమునకు జతపరచిన అటువంటి బాధ్యత లేకుండ నిహితము కావలెను

అయితే, అట్టి ఏదేని అప్పు, తనఖా లేక అటువంటి బాధ్యత వినియోగమునకు బదులుగా క్రయధనమునకు జతపరచవలెను; మరియు

(బి) లైసెన్సుదారు యొక్క లైసెన్సు క్రింద హక్కులు, అధికారములు, ప్రాధికారములు, కర్తవ్యములు మరియు బాధ్యతలు కొనుగోలుదారుడికి అంతరణ కావలెను మరియు అట్టి కొనుగోలుదారుడు లైసెన్సుదారుడిగా భావించబడవలెను.

22.(1) 20వ పరిచ్ఛేదము లేక 24వ పరిచ్చేదము క్రింద నిబంధించబడిన రీతిలో వినియోగము అమ్మివేయబడనిచో, సముచిత కమీషను. వినియోగదారుల హితమును పరిరక్షించుటకు లేక ప్రజాహితము దృష్ట్యా వినియోగమును నిర్వహించుట కొరకు అది అవసరమని భావించునట్టి ఆదేశములను జారీ చేయవచ్చును లేక పథకమును రూపొందించవచ్చును.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద సముచిత కమీషను ఆదేశములను జారీచేయని యెడల లేక పథకమును రూపొందించని యెడల, 20వ పరిచ్చేదము లేక 24వ పరిచ్ఛేదములో నిర్దేశించిన లైసెన్సుదారు. తాను సబబని భావించునట్టి రీతిలో వినియోగమును విక్రయించ వచ్చును.

అయితే, ప్రతిసంహరణ తేదీనుండి ఆరుమాసముల కాలావధి లోపల లైసెన్సుదారు వినియోగమును విక్రయించనిచో, 20వ పరిచ్చేదము లేక 24వ పరిచ్చేదము క్రింద సముచిత కమీషను, ఏదేని వీధి లేక ప్రభుత్వ భూమిలో క్రింద, పైన, ప్రక్కన లేక అడ్డముగాయున్న లైసెన్సుదారు పనులు తొలగింపబడునట్లు చేయవచ్చును. మరియు పునఃస్థాపన చేయబడునట్టి ప్రతియొక వీధి లేక ప్రభుత్వ భూమి మరియు అట్టి తొలగింపు మరియు పునస్థాపన ఖర్చులను లైసెన్సుదారు నుండి రాబట్టుకొనవచ్చును.