పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 244G24

(బి) సముచిత కమీషను, లిఖిత పూర్వక నోటీసు ద్వారా తమ వినియోగమును అమ్మవలసినదిగా లైసెన్సుదారును కోరవచ్చును. మరియు ఇకమీదట లైసెన్సుదారు (ఇటు పిమ్మట ఈ పరిచ్చేదములో "కొనుగోలుదారుడిఘగా " నిర్దేశించబడు) ఎవరి దరఖాస్తు కమీషనుచే స్వీకరించబడినదో ఆ వ్యక్తికి అతడి వినియోగమును అమ్మవలెను;

(సి) లైసెన్సు ప్రతిసంహరణ తేదీన మరియు అప్పటి నుండి లేక లైసెన్సుదారు వినియోగము కొనుగోలుదారుడికి అమ్మిన తేదీ ముందు అయినచో ఆ తేదీన మరియు అప్పటి నుండి. ఆ తేదీకి ముందు ప్రాప్తించిన ఏదేని దాయిత్వ ములు తప్ప లైసెన్సుదారుని హక్కులు, కర్తవ్యములు, బాధ్యతలు - మరియు దాయిత్వములన్నియు పూర్తిగా అంతము కావలెను.

(డి) సముచిత కమీషను, పరిపాలకుల నియామకముతో సహా, వినియోగము నిర్వహణకు సంబంధించి సముచితమని భావించునట్టి మధ్యకాలీన ఏర్పాట్లను చేయవచ్చును;

(ఇ) ఖండము (డి) క్రింద నియమించబడిన పరిపాలకుడు, సముచిత కమీషను ఆదేశించునట్లుగా అట్టి అధికారములను వినియోగించవలెను. మరియు అట్టికృత్యములను నిర్వర్తించవలెను.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద వినియోగమును అమ్మదలచిన యెడల, కొనుగోలుదారుడు, వినియోగము యొక్క కొనుగోలు ధరను అంగీకారము కుదుర్చుకున్నట్టి రీతిలో లైసెన్సుదారుకు చెల్లించవలెను.

(3) సముచిత కమీషను, లైసెన్సుదారుకు వినియోగమును అమ్మవలసినదిగా కోరుచూ ఉప పరిచ్చేదము (1) క్రింద ఏదేని నోటీసును జారీ చేసిన యెడల, అది అట్టి నోటీసు ద్వారా వినియోగమును ఇచ్చివేయమని లైసెన్సుదారును కోరవచ్చును. మరియు ఇకమీదట లైసెన్సుదారు, నోటీసులో నిర్దిష్ట పరచిన తేదీన దాని కొనుగోలు ధర చెల్లింపుపై పేర్కొన బడిన కొనుగోలుదారుడికి వినియోగమును ఇచ్చినేయవలెను.

(4) ఉష పరిచ్ఛేదము (3)లో నిర్దేశించు వినియోగమును లైసెన్సుదారు కొనుగోలుదారుడికి ఇచ్చివేసిన యెడల, కాని ఆ ఉప-పరిచ్చేదము క్రింద జారీ చేసిన నోటీసులో నిర్ణయించిన తేదీనాటికి దాని అమ్మకము పూర్తికాని యెడల, సముచిత కమీషను, అమ్మకము పూర్తికాకుండ అది పెండింగులో ఉండగానే, ఆది సబబవి. భావించినచో వినియోగమును నడుపమనియు మరియు నిర్వహించమనియు ఉద్దేశించుచున్న కొనుగోలుదారుడికి అనుమతించ వచ్చును.