పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

23. సరఫరాను సమర్ధవంతముగా నిర్వహించుట కొరకు న్యాయోచిత విద్యుచ్ఛక్తి పంపిణీని సురక్షితము చేయుట మరియు పోటీని పెంపొందించుటకు వెంటనే అట్లు చేయుట అవసరమని. లేక యుక్తమని సముచిత కమీషను అభిప్రాయబడినచో, ఆది, ఉత్తరువు ద్వారా సరఫరా, పంపిణీ, వినియోగము లేక దాని వాడకమును క్రమబద్దీకరించుట కొరకు నిబంధించ వచ్చును.

24(1) పంపిణీ లైసెన్సుదారు.-

(ఎ) నాణ్యమైన విద్యుచ్చ క్తిని గూర్చిన ప్రమాణాల కనుగుణముగా వినియోగదారులకు అంతరాయము కలగకుండ విద్యుచ్ఛక్తి సరఫరా చేయుటలో నిరంతరముగా వైఫల్యము చెందినాడని; లేక

(బి) ఈ చట్టము ద్వారా లేక ఈ చట్టము యొక్క నిబంధనల క్రింద అతనిపై విధించబడిన క్రుత్యములను లేక కర్తవ్యములను నిర్వర్తించలేడని; లేక

(సి) ఈ చట్టము క్రింద సముచిత, కమీషనుచే ఈయబడిన ఏవేని ఆదేశములను పాటించుటలో నిరంతరము వ్యతిక్రమణ చేసినాడని; లేక

(డి) లైసెన్సు నిబంధనలు మరియు షరతులను అతిక్రమించినాడని,

సముచిత కమీషను ఎప్పుడైనను అభిప్రాయపడినచో మరియు ప్రజాహితము దృష్ట్యా అట్లు చేయుట కొరకు అవసరమైన పరిస్థితులు ఏర్పడినచో, సముచిత కమీషను, లిఖితపూర్వకముగా వ్రాసియుంచదగు కారణములపై ఒక సంవత్సరము కాలావధికి మించకుండ పంపిణీ లైసెన్సుదారు లైసెన్సును సస్పెండు చేయవచ్చును మరియు లైసెన్సు యొక్క నిబంధనలు ఆ మరియు షరతుల ననుసరించి పంపిణీ, లైసెన్సుదారు కృత్యములను నిర్వర్తించుటకు పరిపాలకుడిని నియమించవచ్చును.

అయితే, ఈ పరిచ్ఛేదము క్రింద లైసెన్సును సస్పెండు చేయుటకు ముందు, సముచిత కమీషను ప్రతిపాదిత లైసెన్సు సస్పెన్షనుకు వ్యతిరేకముగా విన్నపములు చేసికొనుటకు పంపిణీ లైసెన్సుదారుకు సబబైన అవకాశమును ఈయవలెను మరియు పంపిణీ లైసెన్సుదారుని విన్నపములు ఏవేని ఉన్నచో వాటిని పర్యాలోచించవలెను.

(2) ఉష పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సును సస్పెండు చేసిన మీదట, పంపిణీ లైసెన్సుదారుని యొక్క వినియోగములు, ఒక సంవత్సరము కాలావధికి మించకుండ లేక 20వ పరిచ్ఛేదములో యున్నట్లే నిబంధనలనమసరించి అట్టి వినియోగమును విక్రయించు తేదీ వరకు ఇందులో ఏది తరువాత జరుగునో ఆ తేదీ వరకు పరిపాలకుడిలో నిహితము కావలెను.