పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

12/G12 (77) “పనులు" అను పదపరిధిలో విద్యుత్ లైను, మరియు ఏదేని భవనము. ప్లాంటు, యంత్రము, ఉపకరణములు మరియు ప్రజలకు విద్యుచ్ఛక్తిని ప్రసారము, పంపిణీ లేక సరఫరా చేయుటకు మరియు ఈ చట్టము లేక తత్సమయమున అమలు నందున్న ఏదేని ఇతర శాసనము క్రింద లైసెన్సుదారు యొక్క లేక మంజూరీ ఈయబడిన ఉద్దేశములను అమలు చేయుటకు అవసరమై నట్టి ఏ పేరుతో పిలుపబడున దైనను ఏదేని ఇతర వస్తువు చేరియుండును;

భాగము - 2

జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మరియు ప్రణాళిక.

3. (1) కేంద్ర ప్రభుత్వము, బొగ్గు, సహజ వాయువు, అణుపదార్ధము లేక సామగ్రి, జల మరియు పునర్ వినియోగ ఇంధన వనరులు వంటి వనరులను గరిష్ఠ స్థాయిలో వినియోగించు విద్యుత్ విధానమును అభివృద్ధిపరచుటకు రాజ్య ప్రభుత్వములు మరియు ప్రాధికార సంస్థను సంప్రదించి జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మరియు టారిఫ్ విధానమును ఆయా సమయములందు తయారు చేయవలెను.

(2) కేంద్ర ప్రభుత్వము, ఆయాసమయములందు జాతీయ, విద్యుచ్ఛక్తి విధానము మరియు టారిఫ్ విధానమును ప్రచురించవలెను.

(3) కేంద్ర ప్రభుత్వము ఆయాసమయములందు రాజ్య ప్రభుత్వములతోను మరియు ప్రాధికార సంస్థతోను సంప్రదింపులు జరిపి ఉప-పరిచ్చేదము (1)లో నిర్దేశించిన జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మరియు టారిఫ్ విధానమును పునర్విలోకనము లేదా పునరీక్షణ చేయవలెను.

(4) ప్రాధికారసంస్థ, జాతీయ విద్యుచ్ఛక్తి విధానముననుసరించి జాతీయ విద్యుచ్చక్తి ప్రణాళికను . తయారు చేసి ఐదు సంవత్సరములకు ఒకసారి దానిని అధి సూచించవలెను:

అయితే, ఆ ప్రాధికార సంస్థ జాతీయ విద్యుచ్ఛక్తి ప్రణాళికను తయారు చేయునపుడు జాతీయ విద్యుచ్ఛక్తి విధానము ముసాయిదాను ప్రచురించి, దానిపై విహితపరచబడునట్టి గడువు లోపల లైసెన్సుదారులు, ఉత్పాదక కం పెనీలు మరియు ప్రజల నుండి సూచనలు మరియు ఆక్షేపణలను కోరవలెను.

అంతేకాక, ప్రాధికార సంస్థ.

(ఎ) కేంద్ర ప్రభుత్వము యొక్క ఆమోదము పొందిన తరువాత ఆ ప్రణాళికను అధిసూచించవలెను;