పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

13/613 . (బి) ఖండము (ఎ) క్రింద కేంద్ర ప్రభుత్వము ఆమోదమును మంజూరు చేయునపుడు ఇచ్చిన ఏవేని ఆదేశములను ప్రణాళికలో చేర్చి పునరీక్షణ చేయవలెను.

(5) ప్రాధికార సంస్థ, జాతీయ విద్యుచ్ఛక్తి "విధానముననుసరించి జాతీయ విద్యుచ్ఛక్తి ప్రణాళికను పునర్విలోకనము లేదా పునరీక్షణ చేయవచ్చును.

4. కేంద్ర ప్రభుత్వము, రాజ్య ప్రభుత్వములతో సంప్రదించిన తరువాత గ్రామీణ ప్రాంతములకు (పునర్ వినియోగ ఇంధన వనరులు మరియు సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాతిపదికగా ఏర్పడిన వ్యవస్థలతోసహా) స్టాండ్ ఎలోన్ వ్యవస్థలను అనుమతించుచూ జాతీయ విధానమును తయారు చేసి మరియు అధిసూచించవలెను.

5. కేంద్ర ప్రభుత్వము, రాజ్య ప్రభుత్వములతో, మరియు రాజ్య కమీషన్లతో సంప్రదించి, గ్రామీణ విద్యుదీకరణ కొరకు భారీ ప్రమాణంలో విద్యుత్ కొనుగోలు కొరకు పంచాయితీ సంస్థలు, వినియోగదారుల అసోసియేషనులు, సహకార సంఘాలు, ప్రభుత్వేతర వ్యవస్థలు లేదా ఫ్రాంచైజీల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో విద్యుచ్ఛక్తి స్థానిక పంపిణీ నిర్వహణ కొరకు జాతీయ విధానమునొకదానిని కూడ రూపొందించ వలెను.

6. గ్రామీణ విద్యుచ్ఛక్తి మౌళిక సదుపాయాల్ మరియు గృహావసరాల యొక్క విద్యుదీకరణ ద్వారా గ్రామాలు మరియు పల్లెలతోసహా అన్ని ప్రాంతాలకు విద్యుచ్ఛక్తిని కల్పించుట కొరకు సంబంధిత రాజ్య ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము సమిష్టిగా ఆ ఏర్పాటు చేయుటకు పాటుపడవలెను.

భాగము - 3

విద్యుచ్ఛక్తి ఉత్పాదన

7. ఏదేని ఉత్పాదక కంపెనీ, 73వ పరిచ్ఛేదము యొక్క ఖండము (బి)లో నిర్దేశించిన గ్రిడ్ తో జోడింపుకు సంబంధించిన సాంకేతిక ప్రమాణములను పాటించినచో, ఈ చట్టము క్రింద లైసెన్సు తీసుకోకుండ ఉత్పాదక స్టేషనును స్థాపించి, నడుప వచ్చును మరియు నిర్వహించవచ్చును.

8. (1) 7వ పరిచ్చేదములో ఏమి ఉన్నప్పటికిని, జలవిద్యుత్ ఉత్పాదక స్టేషను నెలకొల్పదలచిన ఏదేని ఉత్పాదక కంపెనీ, కేంద్ర ప్రభుత్వము. ఆయా సమయములందు అధి సూచన ద్వారా నిర్ణయించునట్టి మొత్తమునకు మించిన మూలధన వ్యయముతో కూడిన అంచనా వ్యవయముతో పథకమును రూపొందించి ప్రాధికార సంస్థకు దాని సమ్మతి కొరకు సమర్పించవలేను.