పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 11/GTI (69) “సబ్ స్టేషను” అనగా ప్రసారము. లేక పంపిణీ కొరకు విద్యుచ్ఛక్తిని రూపాంతరము' లేక పరివర్తనము చేయుట కొరకైన స్టేషను అని అర్థము మరియు ఈ పదబంధ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లు, కన్వర్టర్లు, స్విచ్ గేర్లు, కెపాసిటర్లు, సింక్రోనస్ కండెన్సర్లు, కట్టడములు, కేబులు మరియు ఇతర అనుబంధ సాధన సామగ్రి మరియు ఆ ప్రయోజనము : నిమిత్తము వినియోగించిన ఏదేని భవనము మరియు అది ఉన్న స్థలము చేరియుండును;

(70) విద్యుచ్ఛక్తికి సంబంధించి “సరఫరా” అనగా లైసెన్సుదారుకు లేక వినియోగదారునికి విద్యుచ్ఛక్తి అమ్మకము అని అర్థము:

(71) “వర్తకము " అనగా తిరిగి అమ్ముట కొరకు విద్యుచ్ఛక్తి కొనుగోలు అని అర్థము మరియు "వర్తకము " అను పదమును తదనుసారముగ అన్వయించవలెను;

(72) "ప్రసార లైన్లు" అనగా అట్టి కేబుళ్లు లేక ఉపరితల మార్గములకు అవసరమైన మరియు నియంత్రించుటకు వినియోగించిన ఏవేని స్టెప్-అప్ మరియు స్టెప్-డౌన్ ట్రాన్స్ ఫార్మర్లు, స్విచ్ గేర్లు మరియు ఇతర పనులు మరియు అట్టి ట్రాన్స్ ఫార్మర్లు, స్విచ్ గేర్లు మరియు ఇతర పనులను సమకూర్చుటకు అవసరమైనట్టి భవనములు లేక వాటి భాగములతోపాటు ఒక ఉత్పాదన స్టేషను నుండి మరియొక ఉత్పాదన స్టేషను లేక సబ్ స్టేషనుకు విద్యుచ్ఛక్తిని ప్రసారము చేయుచున్న (లైసెన్సుదారుని పంపిణీ వ్యవస్థలోని ఆవశ్యక భాగము కానట్టి) అన్ని అధిక వత్తిడిగల కేబుళ్లు మరియు ఉపరితల మార్గములు అని అర్థము:

(73) "ప్రసార లైసెన్సుదారు" అనగా ప్రసార లైన్లు వేయుటకు లేక నిర్వహించుటకు ప్రాధికార మీయబడిన లైసెన్సుదారు అని అర్థము:

(74) “ప్రసరించు" అనగా ప్రసార లైన్ల ద్వారా విద్యుచ్ఛక్తి సరఫరా చేయుట అని అర్ధము మరియు " ప్రసారము" అనుపదమును తదనుసారముగా అన్వయించవలెను;

(75) “వినియోగము" అనగా విద్యుత్ లైన్లు లేక విద్యుత్ ప్లాంటు అని అర్థము మరియు ఈ పదపరిధిలో, ఈ చట్టము యొక్క నిబంధనల క్రింద ఉత్పాదన కంపెనీ లేక లైసెన్సు దారుగా పనిచేయుచున్న ఎవరేని వ్యక్తికి చెందిన అన్ని భూములు, భవనములు, పనులు మరియు వాటికి జతచేసిన సామగ్రి చేరి యుండును;

(76) “వీలింగు" అనగా 62వ పరిచ్ఛేదము క్రింద నిర్ధారించబడునట్టి ఛార్జీల చెల్లింపుపై "విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటకు ఇతర వ్యక్తిచే ప్రసార లైసెన్సుదారు. లేక సందర్భానుసారముగ పంపిణీ లైసెన్సుదారు యొక్క పంపిణీ వ్యవస్థ మరియు అనుబంధిత సౌకర్యములను వినియోగించుట ద్వారా చేయబడిన పని అని అర్థము.