పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

119 6119.

169. అపీ లేటు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్, సభ్యులు, అధికారులు మరియు ఇతర ఉద్యోగస్తులు మరియు సముచిత కమీషను యొక్క చైర్ పర్సను, సభ్యులు, కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగస్తులు, 126వ పరిచ్ఛేదములో నిర్దేశించబడిన మదింపు అధికారి, ఈ చట్టపు ఏవేని నిబంధనలను పురస్కరించుకొని చేయునపుడు లేదా చేయుటకు ఉద్దేశించునపుడు భారత శిక్షా స్మృతి యొక్క 21వ పరిచ్ఛేదపు అర్థములో ఉన్న పబ్లికు సేవకులుగా భావింపబడవలెను.


170. ఈ చట్టము క్రింద వ్యక్తి చెల్లించవలసిన ఏదేని పెనాల్టీ చెల్లించని యెడల, భూమిశిస్తు బకాయి వలె దానిని వసూలు చేయవచ్చును.

171 (1) ఈ చట్టము ద్వారా లేదా దానిక్రింద అవసరమయిన లేదా ఎవరేని వ్యక్తికి పంపుటకు ప్రాధికారమీయబడిన ప్రతి నోటీసు, ఉత్తర్వు లేదా దస్తావేజును, సంతకం చేయబడిన తిరుగు రశీదును పొందిన తరువాత గాని లేదా రిజిస్టర్డు పోస్టు లేదా విహితపరచబడునట్టి బట్వాడా సాధనాల ద్వారా,

(ఎ) చిరునామాదారు సముచిత ప్రభుత్వము అయిన యెడల, ఈ విషయమై సముచిత ప్రభుత్వము విహితపరచినట్టి అధికారి కార్యాలయమునందు;

(బి) చిరునామాదారు సముచిత కమీషను అయిన యెడల, సముచిత కమీషను కార్యాలయము నందు;

(సి) చిరునామాదారు ఒక కంపెనీ అయిన యెడల, కంపెనీ యొక్క రిజిస్టర్డు కార్యాలయము నందు లేదా కంపెనీ యొక్క రిజిస్టర్డు కార్యాలయము భారత దేశములో లేని సందర్భములో భారత దేశంలో ఉన్న కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయమునందు;

(డి) చిరునామాదారు ఎవరేని ఇతర వ్యక్తి అయిన యెడల, ఆ వ్యక్తి యొక్క సాధారణ లేదా గతంలోని నివాస లేదా వ్యాపార స్థలము నందు,

దానిని అతనికి బట్వాడా చేయుట ద్వారా తామీలు చేయవచ్చును.

(2) ఏదేని ప్రాంగణము స్వంతదారుకు లేదా ఆక్రమణదారుకు ఈ చట్టము ద్వారా లేదా దాని క్రింద ఈయబడిన లేదా పంపుటకు అధికారమీయబడిన ప్రతినోటీసు, ఉత్తర్వు లేదా దస్తావేజును, ఆవరణ స్వంతదారు లేదా ఆక్రమణదారు వివరణతో చిరునామా ఉన్నచో, సరిగా పంపబడినదని భావింపబడవలెను. మరియు దానిని లేదా దాని యొక్క సరియైన నకలును ప్రాంగణములోనున్న వ్యక్తికి బట్వాడా చేయుట ద్వారా లేదా ఆ ప్రాంగణంలో తగిన శ్రద్ధతో బట్వాడా ఎవరికి చేయవలెనో ఆ వ్యక్తి లేనిచో, ఆ ప్రాంగణంలో ముఖ్య ప్రదేశంలో దానిని అంటించుట ద్వారా తామీలు చేయవచ్చును.

172. ఈ చట్టములో తద్విరుద్ధముగా ఏమున్నప్పటికినీ, -