పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

- 118 G118 (3) కేంద్ర కమీష ము యొక్క చైర్ పర్సన్ ఉప పరిచ్చేదము (2)లో నిర్దేశించిన క్రమబద్ధీకరణదారుల వేదిక చైర్-పర్సను అయి ఉండవలెను.

(4) రాజ్య ప్రభుత్వము, రాజ్యములోని విద్యుత్ విధానమును మృదువుగా, సమన్వయంతో అభివృద్ధి చేయుటకు గాను, రాజ్య కమీషను చైర్-పర్సన్ మరియు దాని యొక్క సభ్యులు, ఉత్పాదకత, కంపెనీల ప్రతినిధులు, ఆ రాజ్యములో విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము మరియు పంపిణీలో నిమగ్నమైయున్న ప్రసార లైసెన్సుదారులు మరియు పంపిణీ లైసెన్సుదారులతో కూడియున్న సమస్వయ వేదికనొకదానిని సంఘటితము చేయవలెను.

(5)(ఎ) ప్రతి జిల్లాలో విద్యుదీకరణ విస్తరింపును సమన్వయించుటకు మరియు పునర్విలోకనము చేయుటకు;

(బి) విద్యుత్ సరఫరా మరియు వినియోగదారుని సంతృప్తి యొక్క నాణ్యతను పునర్విలోకనము చేయుటకు;

(సి) ఇంధన సామర్ధ్యాన్ని మరియు దాని యొక్క సంరక్షణను పెంపొందించుటకు

ప్రతి జిల్లాలో సముచిత ప్రభుత్వముచే సంఘటితము చేయబడు ఒక కమిటీ ఉండవలెను.

167. లైసెన్సుదారుకు చెందిన ఏవేని విద్యుచ్ఛక్తి లైన్లు లేదా విద్యుచ్ఛక్తి ప్లాంట్లను లైసెన్సుదారు యొక్క స్వాధీనములో లేని ఏదేని ఆవరణ లేదా స్థలములో గాని లేదా దానిపై గాని ఉంచిన యెడల, అట్టి విద్యుచ్ఛక్తి లైన్లు లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటు, ఏ వ్యక్తి స్వాధీనములో ఉన్నవో ఆ వ్యక్తి పై ఏదేని సివిలు న్యాయస్థానపు ఏదేని ప్రక్రియ క్రింద లేదా ఏవేని దివాలా ప్రొసీడింగులలో అమలు చేయుటకు బాధ్యుడిగా తీసికొనబడరాదు.

168. ఈ చట్టము లేదా దాని క్రింద చేసిన నియమములు లేదా వినియమములు క్రింద సద్భావముతో చేసిన లేదా చేయుటకు ఉద్దేశించిన దేనికైనను సముచిత ప్రభుత్వము లేదా అప్పీలు ట్రిబ్యునలు లేదా సముచిత కమీషను లేదా సముచిత ప్రభుత్వము యొక్క ఎవరేని అధికారి లేదా అపీలు ట్రిబ్యునలు యొక్క ఎవరేని సభ్యుడు అధికారి లేదా ఇతర ఉద్యోగి లేదా సముచిత కమీషను యొక్క ఎవరేని సభ్యులు, అధికారి లేదా ఇతర ఉద్యోగులు లేదా మదింపు అధికారి లేదా ఎవరేని పబ్లికు సేవకుడు పై ఎట్టిదావా, అభియోగము లేదా ఇతర 'ప్రొసీడింగు వేయరాదు.