పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________ 120/G120 (ఎ) రద్దు అయిన చట్టముల క్రింద సంఘటితము చేయబడిన రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డు, ఈ చట్టపు నిబంధనల క్రింద నియత తేదీ లేదా రాజ్య ప్రభుత్వముచే అధిసూచించ బడినట్టి పూర్వపు తేదీ నుండి ఒక సంవత్సర కాలావధి కొరకు రాజ్య ప్రసార వినియోగము మరియు లైసెన్సుదారుగా" భావింపబడవలెను మరియు ఈ చట్టపు నిబంధనలు మరియు దానిక్రింద చేయబడిన నియమములు మరియు వినియమముల ప్రకారం రాజ్య ప్రసార వినియోగము మరియు లైసెన్సుదారు యొక్క కర్తవ్యములను మరియు కృత్యములను నిర్వర్తించవలెను:

అయితే, రాజ్య ప్రభుత్వము, అధి సూచన ద్వారా, కేంద్ర ప్రభుత్వము మరియు రాజ్య ప్రభుత్వములచే పరస్పరం నిర్ణయించబడిన సదరు ఒక సంవత్సర కాలావధి దాటినట్టి తదుపరి కాలావధికి రాజ్య ప్రసార వినియోగము లేదా లైసెన్సుదారువలె వ్యవహరించు టకును కొనసాగించుటకు రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డుకు ప్రాధికార మీయవచ్చును.

(బి) రద్దయిన చట్టముల క్రింద మంజూరు చేయబడిన లైసెన్సులు, ప్రాధీకృతులు, ఆమోదములు, క్లియరెన్సులు మరియు అనుమతులు అన్నియు, నియత తేదీ లేదా సముచిత ప్రభుత్వముచే అధి సూచింపబడినట్టి పూర్వపు తేదీ నుండి ఒక సంవత్సరమునకు మించనట్టి కాలావధి కొరకు, అట్టి లైసెన్సులు, ప్రాధీకృతులు, ఆమోదములు, క్లియరెన్సులు మరియు సందర్భానుసారముగా అనుమతులకు సంబంధించి రద్దు అయిన చట్టములు అమలునందున్న విధంగా అమలులో ఉండుట కొనసాగించవచ్చును మరియు అటు తరువాత అట్టి లైసెన్సులు, ప్రాథీకృతులు, ఆమోదములు, క్లియ రెన్సులు మరియు అనుమతులు, ఈ చట్టము క్రింది లైసెన్సులు, ప్రాధీకృతులు, ఆమోదములు క్లియరెన్సులు మరియు అనుమతులుగా భావించవలెను మరియు అట్టి లైసెన్సులకు, ప్రాధీకృతులు, ఆమోదములు, క్లియ రెన్సులు మరియు అనుమతులన్నింటికి తదనుసారంగా ఈ చట్టపు నిబంధలన్నియు వర్తించును.

(సి) విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టం, 1948 యొక్క 5వ పరిచ్చేదము క్రింద స్థాపించబడిన రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డుల యొక్క అధీనస్థ సంస్థ ఖండము (ఎ)లో నిర్దిష్టపరిచిన కాలావధి ముగిసిన పిమ్మట ఈ చట్టపు భాగము 13 యొక్క నిబంధనలు ప్రకారం అంతరణ చేయవచ్చును

(డి) రాజ్య ప్రభుత్వము, అధిసూచన ద్వారా ఈ చట్టములో ఉన్న ఏవేని లేదా అన్ని నిబంధనలు, ఆధిసూచనలో పొందుపరచబడిన నియత తేదీ నుండి ఆరు నెలలు మించనట్టి కాలావధి పాటు ఆ రాజ్యములో వర్తించకుండా ప్రఖ్యానించవచ్చును.