పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________ 115/6115 (బి) ఈ చట్టపు నిబంధనలు లేదా దాని క్రింది చేయబడిన నియమములు మరియు వినియమములు లేదా ఏదేని లైసెన్సు, ఆ నిబంధనలు ఎవరేని వ్యక్తి భద్రత పై ప్రభావము చూపునంత వరకు పాటించిన రీతి మరియు దాని విస్తరణ విషయమై

పరిశీలించి మరియు నివేదించమని కోరవచ్చును.

(3) ఉప-పరిచ్ఛేదము (2) క్రింద విచారణ జరుపు ప్రతి విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు లేదా ఇతర వ్యక్తి, సాక్షులను హాజరుపరచుటకు, దస్తావేజులను మరియు ప్రధాన విషయములను తప్పనిసరిగ దాఖలు చేయుట నిమిత్తమై క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1908 క్రింద సివిలు న్యాయ స్థానము యొక్క అధికారములను కలిగియుండును మరియు ఎవరేని భారత శిక్షా స్మృతి యొక్క 176వ పరిచ్ఛేదము క్రిందకు వచ్చు విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు ద్వారా శాసనరీత్యా బద్దుడై ఉండునట్లుగా కోరవచ్చును.

162.(1)సముచిత ప్రభుత్వము, అధి సూచన ద్వారా తగిన అర్హతలుగల వ్యక్తులను ప్రధాన విద్యుచ్ఛక్తి ఇన్-స్పెక్టరు లేదా విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టర్లుగా నియమించవచ్చును మరియు అట్లు నియమింపబడినట్టి ప్రతి ఇన్ స్పెక్టరు, ఈ చట్టము క్రింద ప్రధాన విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు లేదా విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు యొక్క అధికారములను వినియోగించవలెను. మరియు కృత్యములను నిర్వర్తించవలెను. మరియు అట్టి ప్రాంతములలో లేదా పనుల తరగతి మరియు విద్యుచ్ఛక్తి అమరింపులకు సంబంధించి మరియు సముచిత ప్రభుత్వము ఆదేశించునట్టి ఆంక్షలకు లోబడి విహితపరచబడినట్టి ఇతర అధికారములను వినియోగించవలెను. మరియు అట్టి ఇతర కృత్యములను నిర్వర్తించవలెను.

(2) ఈ చట్టములో లేదా దానిక్రింద చేసిన ఏదేని నియమములో విరుద్ధముగా అభివ్యక్తమైన నిబంధన లేనందున, ప్రధాన విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు లేదా విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు నిర్ణయము పై సముచిత ప్రభుత్వమునకు గాని లేదా సముచిత ప్రభుత్వము సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఆదేశించిన సముచిత కమీషనుకుగాని అప్పీలు చేయవచ్చును.

163.(1) లైసెన్సుదారు లేదా లైసెన్సు ద్వారా ప్రాధికార మీయబడిన ఎవరేని వ్యక్తి, ఏ ఆక్రమణదారుడి ఏవేని ఆవరణలు లేక భూమి క్రిందగాని, పైనగాని, ప్రక్కనగాని, అడ్డముగా గాని, లోగాని, లేదా మీదగాని అతడిచే విద్యుత్ సరఫరా లైన్లు లేక ఇతర పనులు శాసనబద్ధంగా ఉంచబడినాయో ఆ ఆక్రమణదారుడికి తమ ఉద్దేశమును తెలియజేయుట ద్వారా అతడిచే విద్యుచ్ఛక్తి సరఫరా చేసిన లేక విద్యుచ్ఛక్తి సరఫరా చేయబడిన ఏవేని ఆవరణలలో,-