పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

1161 G116 (ఎ) లైసెన్సుదారుకు చెందిన విద్యుచ్ఛక్తి సరఫరా కొరకైన విద్యుచ్ఛక్తి సరఫరా లైన్ల, మీటర్ల, ఫిట్టింగుల, పనులు మరియు ఉపకరణాల తనిఖీ, పరీక్ష మరమ్మతు లేదా మార్పు చేయుటకు; లేదా

(బి) సరఫరా చేయబడిన విద్యుచ్ఛక్తి పరిమాణ మొత్తమును లేదా సరఫరాలోని విద్యుచ్ఛక్తి పరిమాణమును కనుగొనుటకు; లేదా

(సి) విద్యుచ్ఛక్తి సరఫరా అవసరం లేనియెడల లేదా అట్టి సరఫరాను తీసివేయుటకు మరియు తొలగించుటకు లైసెన్సుదారుకు ప్రాధికారమీయబడిన యెడల, లైసెన్సుదారుకు చెందిన ఏదేని విద్యుచ్ఛక్తి సరఫరా లైన్లు, మీటర్లు, ఫిట్టింగులు, పనులు లేదా ఉపకరణాలను తొలగించు నిమిత్తము ఏదేని యుక్తమైన సమయమున ప్రవేశించవచ్చును.

(2) లైసెన్సుదారు లేదా పైన పేర్కొనిన విధంగా ప్రాధికార మీయబడిన ఎవరేని వ్యక్తి కూడా, ఇందునిమిత్తం కార్యపాలక మేజిస్ట్రేటు ద్వారా చేయబడిన ప్రత్యేక ఉత్తర్వును ను పురస్కరించుకొని మరియు ఆక్రమణదారుకు వ్రాతమూలకంగా ఇరవైనాలుగు గంటలకు తక్కువ కాని నోటీసును ఇచ్చిన తరువాత,-

(ఎ) ఉప పరిచ్ఛేదము (1)లో నిర్దేశించిన ఏదేని ఆవరణ లేదా స్థలంలోనికి దానిలో పేర్కొనిన ఏదేని ప్రయోజనం నిమిత్తం ప్రవేశించవచ్చును.

(బి) అతనిచే విద్యుచ్ఛక్తి సరఫరా చేయు విద్యుచ్ఛక్తి వైర్ల ఫిట్టింగులను, వినియోగదారుకు చెందిన విద్యుచ్ఛక్తి ఉపయోగము కొరకైన పనులు మరియు ఉపకరణాలను పరీక్షించు మరియు పరిశీలించు నిమిత్తం ఏదేని ఆవరణలో ప్రవేశించవచ్చును.

(3) వినియోగదారుడు, ఉప-పరిచ్చేదము (1) లేదా ఉప పరిచ్ఛేదము (2) యొక్క నిబంధనలను పురస్కరించుకొని లైసెన్సుదారుని లేదా పైన పేర్కొనిన విధంగా ప్రాధికారమీయబడిన ఎవరేని వ్యక్తిని తన ఆవరణ లేదా స్థలములోనికి ప్రవేశించుట కొరకైన అనుమతిని నిరాకరించిన యెడల, సదరు లైసెన్సుదారు. లేదా వ్యక్తి అట్లు ప్రవేశించినపుడు, సదరు ఉప పరిచ్చేదముల ద్వారా నిర్వర్తించుటకుగాను అతనికి ప్రాధికారమీయబడిన ఏదేని చర్యను నిర్వర్తించుటకు అతనిని అనుమతించుటకు నిరాకరించిన లేదా అట్టి ప్రవేశము లేదా నిర్వర్తన కొరకుగాను సరియైన సదుపాయములు కలుగజేయుటలో వైఫల్యం చెందిన, లైసెన్సుదారు. వినియోగదారునిపై వ్రాతమూలకమైన నోటీసును తామీలు చేసిన ఇరవై నాలుగు గంటలు గడిచిన తరువాత, అట్టి నిరాకరణ లేదా వైఫల్యం కొనసాగునంత కాలం వినియోగదారునికి సరఫరాను నిలిపి వేయవచ్చును. అయితే అది ఎక్కువ కాలము అయి ఉండరాదు.