పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

114 G114 అయితే, విద్యుచ్ఛక్తి లైను లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటు సరళిలో, దాని మొత్తము మరియు దానిచే విద్యుచ్ఛక్తి ప్రసారం చేసిన స్వభావం మార్పు చెందసంత వరకు, ఏదేని విద్యుచ్ఛక్తి లైను లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటు యొక్క మరమ్మతు, నవీకరణ లేదా సవరణకు ఈ పరిచ్ఛేదములోనున్నదేదియు వర్తించదు.

(3) ఈ పరిచ్ఛేదపు ఆవశ్యకతలను పాటించుటలో ఆప లేటరు వ్యతిక్రమణ చేసిన యెడల, దాని కారణముచే కలిగిన ఏదేని నష్టం లేదా చెరుపుకి అతను పూర్తి నష్ట పరిహారము ఇవ్వవలెను మరియు అట్టి నష్టపరిహారపు మొత్తమునుకు సంబంధించి ఏదేని బేధము లేదా వివాదము సంభవించిన యెడల, ఆ విషయమును మధ్యవర్తిత్వము ద్వారా నిర్ధారించవలెను.

విశదీకరణ:- ఈ పరిచ్చేదము నిమిత్తం, టెలిగ్రాఫిక్, టెలిఫోనిక్ లేదా విద్యుచ్ఛక్తి సిగ్నలింగు సందేశమైనట్టి లైను, విద్యుచ్ఛక్తి లైను, విద్యుచ్ఛక్తి ప్లాంటు లేదా ఇతర పని లేదా దానికై చేసిన ఏదేని ఉపయోగముతో చేర్చుట లేదా ఇతరవిధంగా భంగకరమైన జోక్యము కలిగినచో, టెలిగ్రాఫిక్ లైను హానికరముగా ప్రభావితమైనదని భావించబడవలెను.

161 (1) ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ, సరఫరా లేదా విద్యుచ్చ క్తిని ఉపయోగించు సందర్భంలో లేదా విద్యుచ్ఛక్తి లైన్ల యొక్క ఏదేని భాగం లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటుకు సంబంధించి ఎవరేని వ్యక్తికి ఏదేని ప్రమాదము సంభవించిన యెడల మరియు ఆ ప్రమాద ఫలితంగా మానవుని లేదా జంతవుల ప్రాణానికి నష్టం లేదా మానవునికి లేదా జంతువుకి హాని జరిగినపుడు లేదా బహుశా జరగబోవునపుడు, అట్టి వ్యక్తి, సంఘటన విషయమును మరియు ప్రమాదము ద్వారా నిజంగా జరిగినట్టి ఏదేని నష్టము లేదా హాని విషయమును విహితపరచబడునట్టి ప్రరూపములో మరియు అట్టి సమయములోపల విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరుకు లేదా పైన పేర్కొనినట్టి ఇతర వ్యక్తి లేదా సముచిత ప్రభుత్వము సాధారణ లేక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఆదేశించబడినట్టి ఇతర ప్రాధికారులకు తెలియజేయవలెను.

(2) సముచిత ప్రభుత్వము సముచితమని భావించిన యెడల ఎవరేని విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు లేదా ఈ విషయంలో తనచే నియమింపబడిన ఎవరేని ఇతర వ్యక్తిని,-

(ఎ), అప్పుడప్పుడు లేదా ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ, సరఫరా లేదా విద్యుచ్ఛక్తిని ఉపయోగించు సందర్భంలో ప్రజల భద్రతపై ప్రభావం చూపు ఏదేని ప్రమాదానికి కారణమైన విషయమై; లేదా -