పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

1101 6110 (2) ఏదేని దర్యాప్తు లేదా విచారణ క్రమంలో ఏదేని అపరాధమునకు సంబంధించి 135 నుండి 140వ మరియు 150వ పరిచ్చేదముల క్రింద శిక్షింపదగు అపరాధము, ఒక కేసు ఉత్పన్నమైన ప్రాంతము కొరకు ఈ చట్టము క్రింద ఏర్పాటు చేయబడిన ప్రత్యేక న్యాయస్థానముచే విచారణ జరుపబడు కేసు, ఒకటిని భావించిన యెడల, అట్టి ప్రత్యేక న్యాయస్థానమునకు అట్టి కేసును అంతరణ చేసి ఆ తరువాత ఈ చట్టపు నిబంధనల ప్రకారం అట్టి ప్రత్యేక న్యాయస్థానముచే అట్టి కేసును విచారణ జరిపి మరియు పరిష్కరించవలెను.

అయితే, ఏదేని ప్రత్యేక న్యాయస్థానమునకు కేసు అంతరణకి ముందే అభియుక్తుడిని హాజరు విషయంలో ఏదేని న్యాయస్థానముచే నమోదు కాబడిన ఏదేని సాక్ష్యము పై వ్యవహరించడానికి అట్టి ప్రత్యేక న్యాయస్థానమునకు న్యాయసమ్మతమై ఉండవలెను.

అంతేగాక, అట్టి ప్రత్యేక న్యాయ స్థానము, సాక్ష్యము నమోదు కాబడిన సాక్షుల యొక్క తదువరి పరీక్ష, అడ్డు పరీక్ష మరియు పునః పరీక్ష న్యాయహితము దృష్ట్యా అవసరమని అభిప్రాయబడిన యెడల, ఎవరేని అట్టి సాక్షిని తిరిగి సమను చేయవచ్చును మరియు ఏదేని అట్టి తదుపరి పరీక్ష, అడ్డు పరీక్ష లేదా పునఃపరీక్ష తరువాత అది అనుమతించిన విధంగా సాక్షిని విడుదల చేయవలెను.

(3) ప్రత్యేక న్యాయస్థానము, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 260వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) లేదా 262వ పరిచ్ఛేదములో ఏమిఉన్నప్పటికిని, 135 నుండి 140వ మరియు 150వ పరిచ్ఛేదములలో నిర్దేశించిన అపరాధమును, సదరు స్మృతిలో విహితపరచబడిన ప్రక్రియ మరియు సదరు విచారణకు వర్తించునంత వరకు సదరు స్మృతి యొక్క 263 నుండి 265 వరకు గల పరిచ్చేదముల యొక్క నిబంధనల ప్రకారం సంక్షిప్త పద్దతిలో విచారణ జరుపవచ్చును.

అయితే, ఈ ఉప-పరిచ్ఛేదము క్రింద సంక్షిప్త పద్ధతిన విచారణ జరుగుతున్న క్రమంలో, సంక్షిప్త పద్ధతిలో అట్టి కేసును విచారణ చేయుటకు అది అవాంఛనీయమైన దైన కేసు స్వభావం కలదని ప్రత్యేక న్యాయస్థానం భావించిన యెడల, అట్టి అపరాధమును విచారించుటకుగాను పరీక్షించిన ఎవరేని సాక్షిని తిరిగి పిలువవలెను మరియు సదరు స్మృతి యొక్క నిబంధనలచే నిబంధింపబడిన రీతిలో తిరిగి ఆకర్ణింపబడుటకుగాను కేసును ఉపక్రమించవలెను.

అంతేకాక, ఈ పరిచ్ఛేదము క్రింద సంక్షిప్త విచారణలో ఏదేని దోష స్థాపన విషయంలో, ఐదు సంవత్సరములకు మించని కాలావధిపాటు కారాగారవాస శిక్షను జారీ చేయుట ప్రత్యేక న్యాయస్థానమునకు న్యాయసమ్మతమై ఉండవలెను.