పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

111/G111, (4) ప్రత్యేక న్యాయస్థానం, ఏదేని అపరాధమునకు ప్రత్యక్షంగాగాని లేక పరోక్షంగా గాని సంబంధం ఉన్న లేదా సంబంధం కలిగియుండి గోప్యంగా ఉంచిన ఎవరేని వ్యక్తి యొక్క సాక్ష్యమును పొందు ఉద్దేశంతో, అపరాధమునకు సంబంధించి అతనికి తెలిసియుండిన పరిస్థితులు పూర్తిగాను మరియు నిజంగాను వెల్లడి చేయాలనే షరతులపై అట్టి వ్యక్తికి మరియు దానిని చేయుటలో అసలు వ్యక్తిగాగాని లేదా దుషేరకుడుగా గాని సంబంధం ఉన్న ప్రతి ఇతర వ్యక్తికి క్షమాదానం చేయవచ్చును. మరియు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 308వ పరిచ్ఛేదము నిమిత్తం అట్టి ఏదేని క్షమాదానం 307వ పరిచ్ఛేదము క్రింద సమర్పించినట్లుగా భావించబడవలెను.

(5) ప్రత్యేక న్యాయస్థానము, విద్యుచ్ఛక్తి చౌర్యమునకు గాను డబ్బు రూపేణా విద్యుత్ చౌర్యము కనుగొనబడిన తేదీకి ముందు పన్నెండు మాసముల కాలావధికి లేదా నిర్ధారించబడిన చౌర్యము యొక్క ఖచ్చితమైన కాలావధికి, ఏది తక్కువ అగునో అది, వర్తించు టారిఫ్ రేటుకు రెండు రెట్లకు సమానమైన మొత్తము కంటే తక్కువగాని సివిలు దాయిత్వమును వినియోగదారుడు లేదా వ్యక్తిపై నిర్ధారించవలెను మరియు అట్లు నిర్ధారించ బడిన సివిలు దాయిత్వ మొత్తమును సివిలు న్యాయస్థానపు డిక్రీవ లెనే వసూలు చేయవలెను.

(6) ప్రత్యేక న్యాయస్థానములచే చివరగా అట్లు నిర్ధారింపబడిన సివిలు బాధ్యత ఒక వేళ వినియోగదారుడు లేదా వ్యక్తిచే డిపాజిటు, చేయబడిన మొత్తము కంటే తక్కువ అయిన, వినియోగదారుడు లేదా వ్యక్తిచే బోర్డుకు లేదా లైసెన్సుదారుకు లేదా సందర్భానుసారంగా సంబంధిత వ్యక్తికి అట్లు డిపాజిటు చేయబడిన అధిక మొత్తమును, సదరు డిపాజిటు అయిన తేదీ నుండి చెల్లింపు జరిగిన తేదీ వరకు గల కాలావధికి భారతీయ రిజర్వు బ్యాంకు ప్రధాన ఋణాల పై ప్రస్తుతం ఇచ్చు రేటు చొప్పున వడ్డీతో కలుపుకొని ప్రత్యేక న్యాయస్థానము యొక్క ఉత్తర్వు అందిన తేదీ నుండి పదిహేను దినములలోపల బోర్డు లేదా లైసెన్సుదారుడు లేదా సందర్భానుసారంగా సంబంధిత వ్యక్తిచే వాపసు చేయబడవలెను.

విశదీకరణ: - ఈ పరిచ్చేదము నిమిత్తము “సివిలు దాయిత్వము" అనగా 135 నుండి 140వ మరియు 150వ పరిచ్ఛేదములలో నిర్దేశించబడిన అపరాధము చేయుట వలన బోర్డు లేదా లైసెన్సుదారు లేదా సందర్భానుసారంగా సంబంధిత వ్యక్తిచే కలిగిన నష్టము లేదా చెఱుపు అని అర్ధము.

155. ఈ చట్టములో వేరు విధంగా నిబంధించబడిననే తప్ప, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973ను ఈ చట్టపు నిబంధనలతో అసంగతముగా ఉన్నంత మేరకు ప్రత్యేక న్యాయ స్థానము సమక్షముననున్న ప్రొసీడింగులకు వర్తింపజేయవలెను. మరియు పైన పేర్కొనిన చట్టముల యొక్క నిబంధనల ప్రయోజనముల నిమిత్తం, ప్రత్యేక న్యాయ స్థానము