పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 109/G109

భాగము -18

ప్రత్యేక న్యాయస్థానములు

153.(1) పరిచ్ఛేదములు 135 నుండి 140 మరియు 150వ పరిచ్ఛేదములో నిర్దేశించిన అపరాధములకు సత్వర విచారణను సమకూర్చు నిమిత్తము రాజ్య ప్రభుత్వము, అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా అధి సూచనలో, నిర్దిష్ట పరచబడినట్టి ప్రాంతము లేదా ప్రాంతముల కొరకు అవసరమైనన్ని ప్రత్యేక న్యాయస్థానములను సంఘటితము చేయవచ్చును.

(2) ప్రత్యేక న్యాయస్థానములో ఉన్నత న్యాయస్థానము యొక్క సమ్మతితో రాజ్య ప్రభుత్వముచే నియమించబడవలసిన ఏకైక న్యాయాధీశుడు ఉండవలెను.

(3) ఒక వ్యక్తి ప్రత్యేక న్యాయస్థానమునకు న్యాయాధీశుడుగా నియమింపబడుటకు అతడు అట్టి నియామకమునకు అవ్యవహిత పూర్వము అదనపు జిల్లా మరియు సెషన్సు న్యాయాధీశుడైననే తప్ప అర్హుడు కాదు.

(4) ప్రత్యేక న్యాయస్థానపు న్యాయాధీశునుని పదవి ఖాళీ అయిన లేదా అట్టి ప్రత్యేక న్యాయస్థానపు సాధారణ ఉపవిష్ట ప్రదేశములో హాజరులో లేకున్న లేదా అతని విధులను నిర్వర్తించుటకు, అనారోగ్యముతోగాని లేదా ఇతరవిధంగాగాని అసమర్ధుడైన యెడల ప్రత్యేక న్యాయస్థానములోని ఏదేని అత్యవసర వ్యవహారమును,

(ఎ) ప్రత్యేక న్యాయస్థానములో అధికారిత పరిధిని వినియోగించు ఎవరేని న్యాయాధీశుని ద్వారా,

(బి) అట్టి ఇతర న్యాయాధీశుడు అందుబాటులో లేని యెడల, ఉప పరిచ్చేదము (1) క్రింద అధిసూచించబడి ప్రత్యేక న్యాయస్థానపు సాధారణ ఉపవిష్ట ప్రదేశము పై అధికారితా పరిధి కలిగియున్న జిల్లా మరియు సెషన్సు న్యాయాధీశుని ఆదేశముల ప్రకారం

పరిష్కరింపబడవలెను.

154(1) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లో ఏమియున్నప్పటికిని, పరిచ్ఛేదములు 135 నుండి 140 మరియు 150వ పరిచ్చేదముల క్రింద శిక్షింపబడు ప్రతి అపరాధము, ఏ ప్రత్యేక న్యాయ స్థానము యొక్క అధికారితా పరిధిలో అట్టి అపరాధము జరిగినదో అట్టి ప్రత్యేక న్యాయస్థానము చే మాత్రమే విచారణ జరుపబడవలెను.