పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

- 101 G101 (సి) ఉప పరిచ్ఛేదము (1) క్రింద అపరాధము విషయంలో ఏవేని ప్రొసీడింగులకు అతని అభిప్రాయంలో ఉపయోగించబడ వలసిన లేదా సంబంధించిన ఏవేని ఖాతా పుస్తకములు లేదా దస్తావేజులను పరిశీలించవచ్చును లేదా అభిగ్రహించ వచ్చును. ఎవరి అభిరక్షలో, అట్టి ఖాతా పుస్తకములు లేదా దస్తావేజులు అభిగ్రహించబడినవో ఆ వ్యక్తిని వాటి యొక్క ప్రతులను తయారు చేయుటకు లేదా అతని సమక్షములో దాని నుండి ఉదాహృతులు తీసుకొనుటకు అనుమతించవచ్చును.

(3) సోదా చేసిన స్థలము యొక్క ఆక్రమణదారు లేదా అతని తరఫున ఎవరేని వ్యక్తి సోదా సమయమున హాజరై ఉండవలెను మరియు అట్టి సోదా క్రమంలో అభిగ్రహించబడిన అన్ని వస్తువుల పట్టిక నొకదానిని తయారుచేసి అట్టి ఆక్రమణదారుకు లేదా పట్టికలో సంతకము చేయవలసియున్న వ్యక్తికి పంపవలెను.

అయితే, అట్టి ఆవరణను ఆక్రమించుకొన్న వయోజన పురుష సభ్యుని సమక్షమున తప్ప ఏవేని గృహస్థలములలో గాని లేదా గృహ ఆవరణలలోగాని సూర్యాస్తమయము మరియు సూర్యోదయము మధ్య ఎటువంటి తనిఖీ, సోదా మరియు అభిగ్రహణ జరుపరాదు.

(4) సోదా మరియు అభిగ్రహణకు సంబంధించి క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క నిబంధనలు ఈ చట్టము క్రింద సోదాలుకు మరియు అభిగ్రహణకు సాధ్యమైనంత వరకు వర్తించును.

136.(1) దురుద్దేశంతో, ఎవరైనా-

(ఎ) న్యాయ సమ్మతంగా లేదా, శాసనబద్ధంగా నిలువ చేసిన, డిపాజిటు చేసిన, ఉంచిన, నిలువ ఉన్న లేదా ఉండిన టవరు, స్తంభం, ఏదేని ప్రతిష్టాపన లేదా ప్రతిష్టాపితము చేయు స్థలము లేదా స్థానము నుండి కత్తిరించిన, తొలగించిన లేదా తీసుకొని పోయిన లేదా ఏదేని విద్యుత్ లైను, సామాగ్రీ లేదా మీటరును అంతరణ చేసి లైసెన్సుదారు లేదా సందర్భాను సారము యజమాని సమ్మతి లేకుండా రవాణా సమయములో కుడ లాభము లేదా లబ్ధి కొరకుగాను ఆ చర్య చేసినను లేదా చేయకున్నను; లేదా

(బి) యజమాని సమ్మతి లేకుండా అతని ఆవరణలో, సంరక్షణలో, లేదా నియంత్రణలో నిలువ చేసిన, కలిగియున్న లేదా ఇతర విధంగా ఉంచుకొన్న ఏదేని విద్యుత్ లైను, సామాగ్రి లేదా మీటరును లాభము లేదా లబ్ధి కొరకుగాను ఆ చర్య చేయబడినను లేదా చేయబడకున్నను; లేదా